ఇదేందయ్యా ఇది..బీచ్‌లో దొరికిన కాయిన్స్‌తో ఏకంగా టీవీ కొనేశాడు!

by Dishafeatures1 |
ఇదేందయ్యా ఇది..బీచ్‌లో దొరికిన కాయిన్స్‌తో ఏకంగా టీవీ కొనేశాడు!
X

దిశ,ఫీచర్స్: ఏదైనా పుష్కరాల సమయంలో మనం కృష్ణా నదిలో రూపాయి నాణేలు వేస్తాం. మరి అలా విసిరిన కాయిన్లు ఏమైపోతాయి? అనే సందేహం మీకు రావచ్చు. అవి అందులోనే ఉండిపోతా యెమో అన్న భావన ఉండోచ్చు. కానీ నిజానికి ఆ కాయిన్లు ఎప్పటికీ నదిలోపలే ఉండిపోవు. వాటిని సేకరించేవారు పడవల్లో వచ్చి మెటల్ డిటెక్టర్‌ని వాడుతారు. ఆ డిటెక్టర్‌కి.. కాయిన్లు అతుక్కుంటాయి. అలా వారు నాణేలు సేకరిస్తారు.

ఇదే తరహాలో దక్షిణ అమెరికాలోని చిలీలో.. టిక్ టాకర్ అల్వారెజ్ అనే వ్యక్తి మెటల్ డిటెక్టర్ వాడుతూ సేకరించిన నాణేలతో టీవీ కొని వైరల్ అయ్యాడు. తాజాగా తన కూతురికి వచ్చిన సమస్య కారణంగా అతను అర్జెంటుగా ఓ టీవీ కొనాల్సి వచ్చింది. దాంతో ఓ వారం రోజులు నాణేలు వెతికి, వాటిని ఓ రాత్రి అంతా కడిగి తెల్లారి బ్యాంకుకు వెళ్లి.. వాటిని ఇచ్చి.. కరెన్సీ నోట్లను తీసుకోవాలనుకున్నాడు.

కానీ అంత టైమ్ లేకపోవడంతో ఆ కాయిన్స్ ను మూడు సంచుల్లో నింపి ఆ తర్వాత టీవీ షోరూం కి వెళ్లి.. టీవీ కొన్నాడు. ఇన్ని కాయిన్లు ఎక్కడిది అని షాపు వాళ్లు అడిగితే.. తాను బీచ్‌లు, పార్కుల్లో మెటల్ డిటెక్టర్ ఉపయోగించి, కాయిన్లు సేకరిస్తానని తెలిపాడు. అతనికి "నాణేలు సేకరించేందుకు నాకు 7 రోజులు పట్టిందనీ, ప్రతి వారం సుమారు రూ.17,500 నుంచి రూ.22,000ల విలువైన నాణేలు సేకరిస్తున్నానని చెప్పుకొచ్చాడు.



Next Story

Most Viewed