RRR సినిమాను ఇంతకంటే మంచిగా ఎవరూ వాడలేరు కావొచ్చు! (వీడియో)

by Disha Web Desk 2 |
RRR సినిమాను ఇంతకంటే మంచిగా ఎవరూ వాడలేరు కావొచ్చు! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శకధీరుడు SS రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి మరోసారి జక్కన్న రేంజ్ ఏంటో చూపించారు. అంతేకాదు.. ఈ చిత్రానికి ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు అయిన ఆస్కార్ కూడా వరించింది. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రపంచ స్థాయిలో ఫ్యాన్స్‌తో పాటు క్రేజ్‌ సంపాదించుకున్నారు. ఈ చిత్రం ప్రతీ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్‌కు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. పులులు, సింహాలతో బ్రిటీషు దొర గడీలోకి ఎన్టీఆర్ ఇచ్చిన ఎంట్రీని ఎవరూ మర్చిపోలేరు.

అయితే, ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ సీన్‌ను ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ అద్భుతంగా వాడుకున్నదని చెప్పవచ్చు. రాహుల్ గాంధీని ఎన్టీఆర్, బ్రిటీషు దొరను కేసీఆర్‌గా, ఎత్తెకెళ్లిన చిన్న పాపను తెలంగాణగా, ఎన్టీఆర్‌తో పాటు లారీలోంచి దూకే సింహాలు, పులులను కాంగ్రెస్ ప్రకటించిన ఆరు హామీలుగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు చేస్తుండగా.. కాంగ్రెస్‌ శ్రేణులు వాటికి ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. మరి కొందరైతే RRR సినిమాను ఇంతకంటే మంచిగా ఎవరూ వాడలేరు కావొచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు.



Next Story

Most Viewed