తెలంగాణలోనూ అవే హామీలు ఇస్తున్నారు: కుమారస్వామి

by Disha Web Desk 2 |
తెలంగాణలోనూ అవే హామీలు ఇస్తున్నారు: కుమారస్వామి
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌పై కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ అధినేత కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఐదు గ్యారంటీలు ప్రకటించిందని, ఇప్పుడు ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ ఓట్ల కోసం ఈ ఐదు గ్యారంటీల ముచ్చట చెబుతోందని కుమారస్వామి ఎద్దేవా చేశారు. ఐదు గ్యారంటీలను దేశవ్యాప్తంగా విస్తరించాలని కాంగ్రెస్‌ పార్టీ తాపత్రయపడుతోందని, వాస్తవానికి కాంగ్రెస్‌ ఐదు గ్యారంటీలు కర్ణాటకలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.

ఐదు గ్యారంటీలు విఫలమవడం మాత్రమే కాదని, ఈ ఐదు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఐదు గ్యారంటీలతో పేదలకు ఒరిగేదేం లేదన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తెలంగాణకు వెళ్లి అబద్ధాలు మాట్లాడుతున్నారని కుమారస్వామి విమర్శించారు. కర్ణాటకలో ఐదు గంటల కరెంటు ఇస్తున్నామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారని, కానీ కేవలం 2 గంటల కరెంటే ఇస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కర్ణాటకలో అమలు కావడం లేదని, అయినా ఆ పార్టీ తెలంగాణలో కూడా అవే హామీలు ఇస్తున్నదని మండిపడ్డారు.

Next Story

Most Viewed