కేసీఆర్ కుటుంబంపై చాలా వ్యతిరేకత ఉంది: గోయల్

by Disha Web Desk 2 |
కేసీఆర్ కుటుంబంపై చాలా వ్యతిరేకత ఉంది: గోయల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పేరుతో కలలు కంటున్నారని ఆయన కలలు కలలుగానే మిగిలిపోతాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ కుటుంబంపై చాలా వ్యతిరేకత ఉందని, ఈ సారి అయనను ఫామ్ హౌస్‌కే పరిమితం చేయాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. ఈ ఎన్నికలలో ఆయన కుటుంబం ఓడిపోబోతుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతి పార్టీలేనని ఈ రెండు పార్టీలు రాష్ట్రానికి చేసిందేమి లేదన్నరు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతున్నదని బీసీ సీఎం అవుతారన్నాని ధీమా వ్యక్తం చేశారు.

మేము అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని, ముస్లిం రిజర్వేషన్లపై ఓవైసీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలీదని విమర్శించారు. తెలంగాణ సమాజం ఓవైసీ మాటలు నమ్మే పరిస్థితిలో లేదన్నారు. తెలంగాణలో బీజేపీ యేతర ప్రభుత్వం ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి మోడీ అభివృద్ధికి సహకరించారని మోడీ హయాంలో విదేశీ మారకం విలువ రికార్డ్ స్థాయిలో పెరిగిందన్నారు. రాబోయే రోజుల్లో భారత దేశ ఆర్థిక వ్యవస్థ 3.5 లక్షళ కోట్ల డార్ల నుంచి 35 లక్షల కోట్ల డాలర్లకు పెరగబోతున్నదని ఈ అభివృద్ధి పరుగులో తెలంగాణ భాగస్వామ్యం కావాలని కోరారు.


Next Story