డిసెంబర్ 9న తొలి తెలంగాణ కేబినెట్ భేటీ: రేవంత్

by Disha Web Desk 2 |
డిసెంబర్ 9న తొలి తెలంగాణ కేబినెట్ భేటీ: రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం కొడంగల్ నియోజకవర్గంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ దొడ్డిదారిన గెలవాలని కేసీఆర్ చూస్తున్నాడని.. ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే.. డిసెంబర్ 9వ ఎల్బీస్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసి, అదే రోజు కేబినెట్ భేటీ అయ్యి, ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఓటమి ఖరారు కావడంతో సెంటిమెంట్‌తో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే సీఎం కేసీఆర్ కుట్రపూరితంగా నాగార్జున సాగర్ అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. భారతంలో శకుని మాదిరిగా కేసీఆర్ కుట్రలు చేస్తూ ఆఖరి ప్రయత్నంగా దింపుడు కల్లం ఆశలకు తెరలేపారని మండిపడ్డారు. నాగార్జున సాగర్ విషయంలో వ్యూహాత్మకంగానే వివాదం చేస్తున్నారని దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story