మోడీ సభను టీవీలో చూస్తుంటే బాధగా అనిపించింది: రాజాసింగ్

by Disha Web Desk 2 |
మోడీ సభను టీవీలో చూస్తుంటే బాధగా అనిపించింది: రాజాసింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ సభకు గైర్హాజర్ అవ్వడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. తాను సభకు హాజరైతే ఆ ఎన్నికల ఖర్చు తన ఖాతాలో పడుతుందని, ఈ కారణంగానే తాను హాజరవ్వలేదని రాజాసింగ్ వెల్లడించారు. ఎమ్మెల్యే సగటు ఖర్చు పరిమితి దాటే అవకాశాలున్న నేపథ్యంలోనే తాను వెళ్లలేకపోయానని, కానీ ఎల్బీ స్టేడియంలో జరిగిన సభను కార్యకర్తలతో కలిసి తాను టీవీలో చూసినట్లు తెలిపారు. సభ జరుగుతున్న ఎల్బీ స్టేడియం గోషామహల్ నియోజకవర్గం పరిధిలో ఉందని ఆయన చెప్పారు.

తన గురువు ప్రధాని మోడీ సభను నేరుగా కాకుండా టీవీలో చూడటం తనకు చాలా బాధగా అనిపించిందని, కానీ తప్పలేదన్నారు. తాను ఇప్పటికే నామినేషన్ వేశానని, ఆ సభలో తాను పాల్గొంటే ఆ సభ ఖర్చు మొత్తం తన ఖాతాలో రాసే అవకాశం ఉందన్నారు. ఈ అంశంపై తాను, బీజేపీ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్ తో మాట్లాడామని, వారు కూడా అదే చెప్పారన్నారు. అందుకే సభకు హాజరవ్వలేకపోయినట్లు తెలిపారు. అంతే తప్ప మరే కారణం లేదని, పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకోవాలని రాజాసింగ్ కోరారు.



Next Story

Most Viewed