HYD: ఎన్నికల వేళ పంజాగుట్టలో భారీగా నగదు స్వాధీనం

by Disha Web Desk 2 |
HYD: ఎన్నికల వేళ పంజాగుట్టలో భారీగా నగదు స్వాధీనం
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: హన్మకొండకు తరలిస్తున్న రూ.97.30 లక్షల నగదును టాస్క్​ఫోర్స్ అధికారులు పంజాగుట్ట పోలీసులతో కలిసి స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును ఎన్నికల కోసమే తరలిస్తున్నారా? ఎవరి కోసం తీసుకెళుతున్నారు? అన్న దానిపై విచారణ జరుపుతున్నారు. టాస్క్​ఫోర్స్​డీసీపీ నితికా పంత్​తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల విధుల్లో భాగంగా పంజగుట్ట సబ్​డివిజన్​ఏసీపీ మోహన్​కుమార్, సీఐ భాస్కర్​రెడ్డి, టాస్క్ ఫోర్స్ సీఐ దుర్గారావు, ఎస్ఐలు అశోక్ రెడ్డి, గగన్ దీప్, నవీన్, మహిళా ఎస్ఐ భావనతో కలిసి ఆదివారం గ్రీన్​ల్యాండ్స్ ట్రాఫిక్​సిగ్నల్​వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయంలో అటుగా ఓ ఇన్నోవా కారు వచ్చింది. అనుమానం వచ్చిన అధికారులు కారును ఆపి తనిఖీ చేయగా రూ.97.30 లక్షల నగదు దొరికింది.

ఈ క్రమంలో నగదును తరలిస్తున్న వరంగల్​జిల్లా ఖానాపురం మండలం ధర్మారావుపేటకు చెందిన మందా అనిల్​గౌడ్​(31), మహబూబాబాద్​జిల్లా తొర్రూరు మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన అర్పుల రవి (35)ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ ఇద్దరు కారు డ్రైవర్లని వెల్లడైంది. దాంతోపాటు అనిల్​గౌడ్​సివిల్​కాంట్రాక్టర్​రాజు అనే వ్యక్తి వద్ద ఉద్యోగం చేస్తున్నట్టు తెలిసింది. రాజు సూచనల మేరకే అనిల్​గౌడ్​రవితో కలిసి సోమాజీగూడలో తిరుమల్​రెడ్డి అనే వ్యక్తి నుంచి ఆ నగదును తీసుకున్నట్టుగా నిర్ధారణ అయ్యింది. అనంతరం హన్మకొండ సహకారనగర్​లో తిరుమల్​రెడ్డికే చెందిన సాయి దత్తా కన్ స్ర్టక్షన్స్​ఆఫీస్ లో అప్పగించేందకు హన్మకొండకు బయల్దేరినట్టుగా వెల్లడైంది. డబ్బుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవటంతో సీజ్​చేసిన నగదును పోలీసులు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు.

Next Story

Most Viewed