పార్టీ కార్యకలాపాలకు ఎంపీ రాఘవ్ చడ్డా దూరం.. స్పందించిన ఢిల్లీ మంత్రి

by Dishanational6 |
పార్టీ కార్యకలాపాలకు ఎంపీ రాఘవ్ చడ్డా దూరం.. స్పందించిన ఢిల్లీ మంత్రి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డా అదృశ్యంపై స్పందించారు ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్. రాఘవ్ చడ్డా మేజర్ కంటి సర్జరీ కోసం యూకేలో ఉన్నారని వివరించారు. రాఘవ్ కళ్లకి అనారోగ్య సమస్యలు తలెత్తాయని తెలిపారు. ట్రీట్మెంట్ కోసం యూకేకు వెళ్లారని తెలిపారు. రాఘవ్ సమస్య తీవ్రమైనదని.. సకాలంలో చికిత్స అందించకపోతే అంధత్వం వచ్చే అవకాశం ఉందని రాఘవ్‌ తనకు చెప్పారంటూ భరద్వాజ్ వెల్లడించారు.

రాఘవ్‌ చడ్డా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు సౌరభ్ భరద్వాజ్. కోలుకున్న వెంటనే ఆయన ప్రచారంలో పాల్గొంటారని అన్నారు.

చికిత్స కోసం భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ నాటి నుంచి ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ తరుపున ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్ధులకు మద్దతుగా సునీతా కేజ్రీవాల్ ప్రచారం చేయడంతో పాటు ఇతర పరిణామాలపై ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా స్పందిస్తూ వస్తున్నారు.

తీహార్ జైలు అధికారులు కేజ్రీవాల్ డయాబెటిస్‌కు ఇన్సులిన్ సహా ఇతర మందులను నిరాకరిస్తున్నారని పార్టీ ఆరోపణలపై చడ్డా స్పందించారు. ఇది చాలా అవమానవీయం, జైలు నిబంధనలుక విరుద్ధం అని ఏప్రిల్ 18న సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు.

Next Story

Most Viewed