ఐఏఎస్, ఐపీఎస్‌ల పోస్టింగ్ విషయంలో బీఆర్ఎస్‌కు EC ఝలక్

by Disha Web Desk 2 |
ఐఏఎస్, ఐపీఎస్‌ల పోస్టింగ్ విషయంలో బీఆర్ఎస్‌కు EC ఝలక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఐఏఎస్, ఐపీఎస్ పోస్టింగ్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ఎస్‌కు ఝలక్ ఇచ్చిందనే చర్చ జరుగుతున్నది. ఉత్తరాదికి చెంది న ఆఫీసర్లు అందులో ఇంతకాలం లూ ప్ లైన్‌లో నెట్టబడిన వారికి ప్రియారిటీ ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల పక్రియలో రూలింగ్ పార్టీకి పాజిటివ్‌గా వ్యవహరిస్తారనే అనుమానంతో తెలుగు అధికారులను సైతం పక్కన పెట్టినట్టు సమాచారం. మూడు రోజుల క్రితం 20 మంది ఆఫీసర్లపై ఈసీ బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. ఆ ప్లేస్‌లో కొత్తగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం పంపిన జాబితాలోని ఆఫీసర్ల పనితీరు, సమర్థతను పూర్తిగా పరిశీలించిన తరువాత నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

షాక్‌కు గురైన బీఆర్ఎస్ లీడర్లు

కొత్త ఆఫీసర్ల ఎంపిక తీరును చూసి బీఆర్ఎస్‌లోని కీలక నేతలు షాక్‌కు గురైనట్టు తెలుస్తున్నది. ఎన్నికల ప్రచారం, పోల్ మేనేజ్‌మెంట్ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలనే సంకేతాలను లీడర్లకు పంపినట్టు తెలిసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు ఎలక్షన్ ప్రక్రియలో ఏ పోస్ట్‌లో ఎవరు ఉండాలి? అనే అంశంపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు కేటీఆర్, హరీశ్ కసరత్తు చేసి పోస్టింగ్ ఇచ్చారు.

తెలుగు ఆఫీసర్లకు మొండి చెయ్యి

ఎంపిక చేసిన ఆఫీసర్లలో పాలన వ్యవహారాల్లో ముక్కుసూటిగా ఉంటారనే ముద్ర పడిన వారికి ప్రియారిటీ ఇచ్చిందనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రభుత్వం పంపిన జాబితాలో ప్రమోషన్ల ద్వారా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు ఎంపికైన ఆఫీసర్లు, నాన్ కేడర్ ఎస్పీలు సైతం ఉన్నట్టు ప్రచారం ఉంది. వీరంతా తెలుగు వారే కావడం గమన్హారం. కానీ ఈసీ ఎంపిక చేసిన ఆఫీసర్లలో ఎక్కువ మంది నార్త్ ఇండియాకు చెందిన వారే ఉన్నారు. తెలుగు ఆఫీసర్లను ఎంపిక చేస్తే రూలింగ్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారనే అనుమానంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం ఉంది.

భయం వద్దని భరోసా

అధికారులపై వేటు వేసిన తరువా త బీఆర్ఎస్ లీడర్లలో ఆందోళన నెలకొంది. పోలింగ్ ముగిసే వర కు అడుగడుగునా ఆంక్షలు ఉం టాయని భయం పట్టుకున్నది. ఈ విషయాలను గ్రహించిన బీఆర్ఎస్ అగ్రనేతలు అధైర్యపడొద్దని, ఎప్పు డు ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్లాలి? అని అభ్యర్థులకు భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచా రం ఉంది. అయితే కాంగ్రెస్‌కు ప ట్టున్న గ్రామాల్లో ఎలా పుంజుకోవాలనే దానిపై ప్రత్యామ్నాయ మా ర్గాలను అన్వేషిస్తున్నట్టు తెలుస్తున్నది. నమ్మకస్తులైన పార్టీ లీడర్లతో పోల్ మేనేజ్‌మెంట్ నిర్వహించాలని సూచిస్తున్నట్టు సమాచారం.


Next Story