బీఆర్ఎస్ ప్రచార రథం రెడీ.. కేసీఆర్‌కు గిఫ్ట్ ఇచ్చిన మాజీ సీఎం!

by GSrikanth |
బీఆర్ఎస్ ప్రచార రథం రెడీ.. కేసీఆర్‌కు గిఫ్ట్ ఇచ్చిన మాజీ సీఎం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం సిద్దమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం కేసీఆర్‌కు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రచార రథం బహుమతిగా ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ నుంచి తెలంగాణకు బస్సు చేరుకుంది. ఈ బస్సుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు అధినేత చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో సర్వాంగ సుందరంగా ప్రచార రథం ముస్తాబైంది. ఇవాళ్టి నుంచి మొదలయ్యే కేసీఆర్ ప్రచార పర్వంలో తెలంగాణా రోడ్లపై ప్రచార రథం పరుగులు పెట్టనున్నది. ఇవాళ హుస్నాబాద్‌కు ఇదే ప్రచార రథంలో వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Next Story

Most Viewed