పులివెందులకు షర్మిల.. నాన్న వర్ధంతి రోజే కీలక ప్రకటన..?

by Disha Web Desk 19 |
పులివెందులకు షర్మిల.. నాన్న వర్ధంతి రోజే కీలక ప్రకటన..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇవాళ ఏపీలోని పులివెందులకు ప్రయాణం అవుతున్నారు. రేపు (శనివారం) వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆమె నివాళులు అర్పించనున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, నిన్న షర్మిల ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీతో కీలక భేటీ అవ్వడంతో వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్‌లో కలపడంపై గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు టాక్. ఇదే అంశంపై గత కొంత కాలంగా కూడా ఆమె కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుతున్న విషయం తెలిసిందే.

వైఎస్ఆర్ వర్ధంతి రోజు విలీన ప్రకటన..?

షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తారా లేదా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తారా అనేది ప్రశ్నగా మారింది. మరోవైపు అధిష్టానం ఏపీకి ప్రాతినిధ్యం వహించాలని కోరినట్లు తెలుస్తోంది. కానీ షర్మిల మాత్రం తెలంగాణలోనే పాలిటిక్స్ చేయాలని బహిరంగంగానే చెప్పింది. మరోవైపు కర్ణాటక నుంచి రాజ్యసభ‌కు కూడా ఎంపిక చేసే అవకాశం లేకపోలేదనే టాక్ కూడా వినిపిస్తోంది. శనివారం (సెప్టెంబరు 2న) వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి నాడు పార్టీ విలీనం పై ప్రకటన వెలువడే అవకాశముందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Next Story

Most Viewed