పోలీసు సైరన్‌తో కారులో యువకుల హల్‌చల్..

by Rajesh |
పోలీసు సైరన్‌తో కారులో యువకుల హల్‌చల్..
X

దిశ, వరంగల్ : వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాకరసి కుంట సమీపంలో కొందరు యువకులు పోలీసు సైరన్ వేస్తూ TS03EQ3816 నంబర్ గల కార్‌లో చక్కర్లు కొడుతున్నారు. అర్ధరాత్రి సమయంలో జనాలను భయభ్రాంతులకు గురిచేస్తూ హల్చల్ చేస్తున్నారు. అటువైపు నుండి వెళ్తున్న A1టివి విలేఖరి కటకం వేణుగోపాల్ ఆ దృశ్యాన్ని చూసి మొబైల్‌లో వీడియో తీస్తుండగా ఆ వాహనంలో ఉన్న యువకులు విలేకరి నుండి మొబైల్ లాక్కొని మేం డిపార్ట్‌మెంట్, నువ్వు ప్రెస్ హా అంటూ నీ ఐడి కార్డ్ చూపించు అంటూ దౌర్జన్యానికి దిగారు. గమనించిన స్థానికులు రావడంతో పరారయ్యారు.

ఆ కారును గమనించిన విలేకరి కారు ముందు నెంబర్ ప్లేటు లేకపోవడంతో వెనక సైడు నెంబర్ ప్లేటు ఫోటో తీయగా నెంబర్ ప్లేట్‌కి కింది భాగంలో GWMC Corporation అని రాసి ఉన్నట్లు గుర్తించారు. కారులో కాంగ్రెస్ కండువా ఉందనీ, ఆ కారులో నలుగురు యువకులు ఉన్నారనీ ఆ యువకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మిల్స్ కాలనీ స్టేషన్ లో వరంగల్ జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న మిల్స్ కాలనీ పోలీసులు పలు కేసులు నమోదు చేసి కార్లో యువకులు ఎవరన్నా విషయంపై దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed