మీ నీడ మాయం కానుంది! జీరో షాడో డే

by Disha Web Desk 14 |
మీ నీడ మాయం కానుంది! జీరో షాడో డే
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ వాసులు ఒక అరుదైన ఖగోళ అద్భుతాన్ని చూడబోతున్నారు. మిట్ట మధ్యాహ్నం టైమ్‌లో మన నీడ మాయం కానుంది. దాన్నే జీరో షాడో డే అంటారు. సూర్యుడు నడినెత్తి మీదకి రావడంతో ఎండలో నిటారుగా నిలబడినా లేదా ఏదైనా వస్తువులను పెట్టి వాటి నీడ కనిపించదు. ఇలా ఏడాదికి రెండుసార్లు జీరో షాడో డే జరుగుతుంది. ఈ జీరో షాడో డే అధ్బుతం గురువారం మధ్యాహ్నం 12:12 గంటలకు ప్రారంభమవుతుంది.

2, 3 నిమిషాల వరకు కొనసాగుందని హైదరాబాద్‌లోని బీఎం బిర్లా నక్షత్రశాల ప్రతినిధులు బుధవారం తెలిపారు. అయితే, ఒకవేళ మేఘాలు కమ్ముకోవడం, వర్షం పడటం జరిగితే ఈ జీరో షాడో కనిపించే అవకాశం ఉండదని, జీరో షాడో డే వస్తే ఔత్సాహికులు తమ ఫోటోలను [email protected]కు మెయిల్ చేయాలని సూచించారు.

Next Story

Most Viewed