పార్టీలు మారితే గౌరవం దొరకదు..! ఈటల వ్యాఖ్యల దుమారం..

by Disha Web Desk 14 |
Eatala Rajender
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకుడు ఈటెల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి దాదాపు ఆయన 20 ఏళ్లు పార్టీతోనే ఉన్నారు. భూ కబ్జాల ఆరోపణల వల్ల ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ లోకి వెళ్లారు. ఆయన బీజేపీలోకి వెళ్లిన తర్వాత 2023 జులైలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ లాంటి కీలక కూడా బాధ్యతలు అధిష్టానం అప్పగించింది.

పార్టీల మార్పులపై ఇటీవల ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈటెల స్పందించారు. ‘ఒక పార్టీలో ఒక స్థాయిలో ఉన్న నాయకులు ఇంకోక పార్టీకి మారొద్దు. నా అనుభవం చెబుతున్నా’ అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు స్థాయి, స్థానం గౌరవం, బంధం, అనుబంధం ఈ పార్టీతోనే ఉండేదని వ్యాఖ్యలు చేశారు. కానీ మరొక పార్టీలోకి మారానని అన్నారు.

‘ఒక పార్టీలోకి మారినప్పుడు మనకు అక్కడ దొరికిన గౌరవం దొరకాలంటే.. అక్కడ ఉన్న పొజిషన్ దొరకాలంటే అది సాధ్యమయ్యే పని కాదు’ అని అన్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బాగుండేదని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం లేపు తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అభిమానులు వచ్చేయండి సర్ మళ్ళీ బీఆర్ఎస్‌లోకి అని ఆహ్వానిస్తున్నారు.


Next Story

Most Viewed