నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాలతో అన్నారం బ్యారేజీ లో ప్రారంభమైన పనులు..!

by Disha Web Desk 12 |
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాలతో అన్నారం బ్యారేజీ లో ప్రారంభమైన పనులు..!
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశాలతో కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ ఎగువన ఉన్న ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు పియర్స్ వద్ద సౌండింగ్, ప్రోబింగ్ పరీక్షలు చేయాల్సి ఉండగా వీటికి ఇసుక మేటలు అడ్డంగా ఉన్నందున వాటిని తొలగించే ప్రక్రియ మొదలైనట్లు తెలుస్తుంది. కాగా ఇటీవల బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీలో నిటీ భూడగలు ఏర్పాడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వాటిని ప్రత్యేకమైన కెమికల్ తో నిర్మూలించే ప్రయత్నం చేయగా అప్పటికే లీకేజీలు, నీటి బుడగలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో గత ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం తో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కొల్పోయింది. నాటి నుంచి నేటి వరకు ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.



Next Story

Most Viewed