ప్రిపేర్ అయి సభలో కూర్చున్నాం.. అసెంబ్లీలో హరీశ్ రావు వర్సెస్ శ్రీధర్ బాబు

by Disha Web Desk 13 |
ప్రిపేర్ అయి సభలో కూర్చున్నాం.. అసెంబ్లీలో హరీశ్ రావు వర్సెస్ శ్రీధర్ బాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో:అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పై శ్వేతపత్రం విషయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరిగేషన్ పై శ్వేతపత్రాన్ని రేపు సభలో ప్రవేశపెడతామని అధికార పక్షం చెప్పగా దీనికి విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవాళే విడుదల చేసి చర్చించాలని పట్టుబట్టాయి. ఎజెండాలో ఉన్నందున ఇవాళే పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కోరారు. ఎజెండా బేఖాతరు చేసి రేపటికి వాయిదా వేయడం సబబు కాదన్నారు. ఇవాళ సభలో శ్వేతపత్రం ఉంటుందని మేమంతా ఉదయం నుంచి ప్రిపేర్ అయి ఇక్కడ కూర్చున్నామని బీఏసీ నిర్వహించకుండా మరో రోజు ఎలా పొడిగిస్తారని ప్రశ్నించారు. ఇవాళ రాత్రి 11 అయినా పర్వాలేదు ఈ అంశంపై చర్చిద్దామన్నారు. ఉదయం నుంచి చర్చ ఉంటుందని చెప్పి సడెన్ గా మార్చితే సభ సంప్రదాయాలకు మంచిది కాదని, శాసనసభ వ్యవహారాల మంత్రి సభ సంప్రదాయాలను పాటించాలన్నారు. బీఏసీ నిర్వహించకుండా సభను ఇష్టమున్నట్లుగా వాయిదా వేస్తే మంచిది కాదని సభలో కొత్త అంశాలపై బీఏసీలో చర్చించాలన్నారు.

అందువల్లే రేపటికి వాయిదా:

ప్రతిరోజు బీఏసీ నిర్వహించరని ఈ విషయాన్ని బీఏసీ బీఆర్ఎస్ గమనించాలని మంత్రి శ్రీధర్ బాబు రిప్లే ఇచ్చారు. చివర్లో ఎదైనా మిగిలితే బిజినెస్ మిగిలి ఉంటే స్పీకర్ అనుమతితో చర్చిస్తామని బీఏసీ మీటింగ్ మినిట్స్ అందరి టేబుల్ మీద ఉందన్నారు. అయినా రేపు బీఏసీకి పిలవాలని స్పీకర్ ను కోరారు. ఇవాళే వైట్ పేపర్ ప్రవేశపెట్టి చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఇది ముఖ్యమైన సబ్జెక్ట్ కావడంతో ఇందులో మా సభ్యులతో పాటు ఇతర పార్టీ సభ్యులు చర్చలో పాల్గొనాలే అభిప్రాయంతో ఉన్నందునే రేపటికి వాయిదా వేశామని చెప్పారు. దీంతో సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.

అభ్యంతరం లేదు: ఎంఐఎం.. సభ పొడిగించాలి: బీజేపీ

ఎజెండాలో పెట్టిన నీటిపారుదల అంశంపై ఇవాళే చర్చించాలని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర రెడ్డి అన్నారు. అవసరం అయితే సభను మరో 4 రోజులు పొడిగించాలని నీటిపారుదలలో అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధమా చెప్పాలన్నారు. పెద్ద సబ్జెక్ట్ కావడం వల్ల రేపు చర్చకు అభ్యంతరం లేదని ఎంఐఎం తన అభిప్రాయం చెప్పగా, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సమ్మక్క సారక్క జాతర తర్వాత ఈ చర్చ పెట్టాలన్నారు. కుదరని పక్షంలో ప్రభుత్వం అనుకూలతను బట్టి ఎప్పుడైనా ఓకే అన్నారు.



Next Story

Most Viewed