సీపీఆర్ పై అవగాహన తప్పనిసరి..

by Disha Web Desk 11 |
సీపీఆర్ పై అవగాహన తప్పనిసరి..
X

దిశ, వరంగల్ కలెక్టరేట్: సీపీఆర్ పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో సీపీఆర్ అవగాహన పై నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. కార్డియాక్‌ అరెస్ట్‌ ద్వారా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. కావున సడన్ కార్డియాక్ అరెస్ట్ అయిన సమయంలో ఆ వ్యక్తిని ఆసుపత్రికి చేర్చి వైద్య చికిత్స అందించేలోపు ఏమైనా జరిగే ప్రమాదం ఉందని, అటువంటి వారికి సత్వరమే ప్రాథమిక చికిత్స అందించాలంటే సీపీఆర్ పైన అవగాహన ఉండాలని చెప్పారు.

జిల్లా కలెక్టర్ పీ. ప్రావీణ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సీపీఆర్ పై అవగాహన కార్యక్రమం ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు సీపీఆర్ మీద అవగాహన కల్పిస్తామన్నారు. సీపీ రంగనాథ్ మాట్లాడుతూ.. తాను హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్నప్పుడు ప్రతి కానిస్టేబుల్, హోంగార్డ్ లకు సీపీఆర్ పై అవగాహన ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాల పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల ట్రాఫిక్, నాన్ ట్రాఫిక్ , కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ తో సహా అందరిని సీపీఆర్ ట్రైనింగ్ లో భాగస్వామ్యం చేసి సడన్ గా వచ్చే హార్ట్ అటాక్ నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

పోలీస్ యంత్రాంగం అంటే లా అండ్ ఆర్డర్ తో పాటు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కూడా శ్రద్ధ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, వర్ధన్నపేట శాసనసభ్యుడు ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ సారయ్య, రాజు యాదవ్, అదనపు కలెక్టర్ లు అశ్విని తానాజీ వాకాడే, శ్రీ వాత్స తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed