అసైన్డ్ భూమిలో ఇళ్ల నిర్మాణాలపై తహసీల్దార్ విచారణ

by Dishaweb |
అసైన్డ్ భూమిలో ఇళ్ల నిర్మాణాలపై తహసీల్దార్ విచారణ
X

దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలంలో రేగుల గూడెం గంగారం ఎక్స్ రోడ్ లో ప్రభుత్వ భూమిలో అక్రమంగా జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలపై మంగళవారం మండల తహసీల్దార్ నాగరాజు విచారణ జరిపారు. గంగారం ఎక్స్ రోడ్ వద్ద సోమవారం రాత్రి స్లాబ్ నిర్మాణం చేయడంతో పలువురు తాసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఇళ్ల నిర్మాణాలు చేయొద్దని ఆదేశాలు ఇచ్చినప్పటికీ యజమానులు ఇళ్ల నిర్మాణాలలో కొనసాగిస్తున్న నేపథ్యంలో తహసీల్దార్ సదరు యజమానులకు నోటీసులు ఇవ్వడంతో పాటు నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వీధుల పట్ల నిర్లక్ష్యం వహించిన గ్రామ కార్యదర్శిలకు నోటీసులు జారీ చేయనున్నట్లు తహసీల్దార్ నాగరాజు విలేకరులకు తెలిపారు.అసైన్డ్ భూమిలో గంగారం ఎక్స్లెంట్ వద్ద అక్రమంగా ఇల్లు నిర్మాణం చేపడుతున్న పోటు రమేష్, పోటు సత్తెక్క, ముల్కల శేఖర్, వెనగంటి తిరుపతి లకు ఎంజాయ్ సీ నోటీసులు ఇవ్వడం తో పాటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు తహసీల్దార్ నాగరాజు వివరించారు. కార్యక్రమంలో సూపరిండెంట్ భాస్కర్ ఉన్నారు.



Next Story

Most Viewed