సీన్ సేమ్ రిపీట్.. పీఎస్సీ ఎస్ వైస్ చైర్మన్‌పై వీగిన అవిశ్వాసం

by Disha Web Desk 23 |
సీన్ సేమ్ రిపీట్.. పీఎస్సీ ఎస్ వైస్ చైర్మన్‌పై వీగిన అవిశ్వాసం
X

దిశ,మల్హర్: మండల కేంద్రం తాడిచర్ల పీఎస్సీ ఎస్ వైస్ చైర్మన్ మల్కా ప్రకాష్ రావు పై డైరెక్టర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులకు గురువారం నిర్వహించిన సమావేశానికి కోరం సభ్యులు ఎవరు హాజరుకపోవడంతో వీగిపోయినట్లు జిల్లా అధికారి శైలజ ప్రకటించారు. సీన్ సేమ్ రిపీట్ సైలెంట్ ఆఫ్ మోడ్ లో భాగంగా చైర్మన్, వైస్ చైర్మన్ లపై పెట్టిన డైరెక్టర్ల అవిశ్వాస నోటీసులకు సమావేశం నిర్వహించిన ఎక్కడి వాళ్లే అక్కడ గప్ చుప్ అయ్యారు. అవిశ్వాస తీర్మాన సమావేశానికి డైరెక్టర్లు డుమ్మా కొట్టారు. దీంతో సైలెంట్ ఆఫ్ మూడ్ లో అవిశ్వాస నెగ్గినట్లు ఆమె పేర్కొన్నారు. కాగా చైర్మన్ చెప్యాల రామారావుపై అవిశ్వాసం పెట్టి నెగ్గెందుకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎనిమిది మంది డైరెక్టర్లలోని వైస్ చైర్మన్ మల్క ప్రకాష్ రావు తో పాటు డైరెక్టర్ బానోత్ సర్వీ నాయక్ అనే ఇద్దరు డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. దీంతో 13 మంది డైరెక్టర్ల్లోనే ఐదుగురు కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్ ఉండగా చేరిన ఇద్దరితో ఏడుగురు ఏడుగురు సభ్యుల బలం చేకూరింది.

చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గాలంటే తొమ్మిది మంది డైరెక్టర్ల మద్దతు ఉండాల్సిందిగా బలనిరూపణ నిరూపించడంలో విఫలం చెందారు. అయితే వైస్ చైర్మన్ మల్కా ప్రకాష్ రావు పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. సొంత పార్టీ డైరెక్టర్ సభ్యులే అయినా అలయన్స్ లో అవిశ్వాస నోటీసులు ఇచ్చిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ సభ్యులు అవిశ్వాస తీర్మాన సమావేశానికి గైర్హాజరు కావడంతో ప్రస్తుత వైస్ చైర్మన్ మల్కా ప్రకాష్ రావు పూర్తి బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు ఆమె ప్రకటించారు. 2020 ఫిబ్రవరిలో జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో గెలుపొందిన 13 మంది డైరెక్టర్ల పదవి కాలం ఐదు సంవత్సరాలకు 2025 ఫిబ్రవరి వరకు ముగింపు పలకనునడడంతో పెట్టిన అవిశ్వాసం నెగ్గడానికి డైరెక్టర్ల మద్దతు కూడా కట్టేందుకు బేరసారాలకు ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫలించలేదు. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్ లపై పెట్టిన అవిశ్వాసాలకు ఉత్కంఠకు దారి తీసిన ఎట్టకేలకు అవిశ్వాస వీగిపోవడం తో రాష్ట్ర ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇలా కావాలనే ఇలా జరగడం జీర్ణించుకొనిలేని విషయంగా చేసిన పీఎస్సీ ఎస్ డైరెక్టర్ల తీరుపై రైతులు, ప్రజలు పలు విమర్శలు గుప్పిస్తూ మండిపడుతున్నారు.


Next Story

Most Viewed