భూమి కోల్పోయిన బాధితుల నిరసన....

by Disha Web Desk 9 |
భూమి కోల్పోయిన బాధితుల నిరసన....
X

దిశ ,కమలాపూర్: పాఠశాల నిర్మాణం కోసం భూమి ఇచ్చిన తమకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ముందు బాధితులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గతంలో పాత ప్రభుత్వ పాఠశాల కూల్చివేసి కొత్త ప్రభుత్వ పాఠశాల నూతన భవన నిర్మాణం కొరకు స్థలం సరిపోకపోవడంతో 2016లో గ్రామసభ ఏర్పాటు చేశారు.

స్థల అవసర నిమిత్తం మండల కేంద్రానికి చెందిన మారం ఎల్లమ్మ, తోట రాజు లకు చెందిన భూమిని తీసుకున్నారని పేర్కొన్నారు. వారికి ప్రభుత్వ ఖాలీ స్థలంతో పాటు ప్రభుత్వము నిర్మించే రెండు పడక గదుల ఇండ్లు మంజూరు చేసే విధంగా అప్పటి గ్రామ పంచాయతీ తీర్మానించి హామీ ఇచ్చారని తెలిపారు. సొంత భూములు ఇచ్చి ఏడు సంవత్సరాలు గడిచిన అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టింపు లేకుండా వివరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వము, అధికారులు స్పందించి భూమి కోల్పోయిన తమకు న్యాయం చేయాలని లేదంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Next Story