కురుస్తున్న వర్షం.. సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి..

by Disha Web Desk 20 |
కురుస్తున్న వర్షం.. సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి..
X

దిశ, కాటారం, భూపాలపల్లి : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పపడిన అల్పపీడనం ప్రభావం నైరుతి రుతుపవనాలు తోడవడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండు రోజులుగా వర్షం కురుస్తూనే ఉన్నది. వర్షం పడుతుండడంతో రెండో రోజు బుధవారం సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. భూపాలపల్లిలోని కేటీకే రెండు, మూడు గనులలో 7.025 టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. వర్షం మూలంగా రూ 1.72 పొట్ల మీదకు సింగరేణికి నష్టం చేకూర్తుంది. కేటీకే రెండు, మూడు సింగరేణి ఉపరితల బొగ్గుగనుల్లో 1.63 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలకు ఆటంకం ఏర్పడింది.

జిల్లాలో 304.8 మీమీ వర్షపాతం నమోదు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురిసిన వర్షాలు బుధవారం ఉదయం పది మండలాల్లో 304.8 మీమీ వర్షాపాతంగా నమోదయింది. జిల్లాలో వర్షాపాతం సరాసరి సగటు 27.7 మీమీ గా నమోదయింది. మహదేవపూర్ మండలంలో 20.6 మీమీ , పలిమేల మండలంలో 17.2 మీమీ, మహాముత్తారం మండలంలో 54.4 మీమీ, కాటారం మండలంలో 37.2 మీమీ, మలహర్ లో17.2 మీమీ, చిట్యాలలో 20.6 మిమీ, టేకుమట్లలో 15.2, మొగుళ్ల పెళ్లిలో 19.4 రేగొండ మండలంలో 34.4 మీమీ, ఘన్పూర్ మండలంలో 32.4 మీమీ, భూపాలపల్లిమండలంలో 36.2 మీమీ వర్షపాతం నమోదయింది.

లక్ష్మీ బ్యారేజ్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం..

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు బుధవారం నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 2,58,730 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండడంతో, ప్రాజెక్ట్ కు ఉన్న 85 గేట్ల నుండి 35 గేట్లను ఎత్తివేసి 2,85,340 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కన్నెపల్లిలోనే లక్ష్మీ పంపు హౌస్ నుండి నీటి ఎత్తిపోతలను నిలిపివేశారు. కాలేశ్వరంలోని త్రివేణి సంగమం గోదావరి వద్ద నీటి ప్రవాహం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. బుధవారం ఉదయం వరకు 8.520 మీటర్లు వరద ప్రవాహం కొనసాగుతోందని సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.


Next Story

Most Viewed