సమయం కంటే ముందే పాఠశాలలకు తాళాలు.. అధికారుల పర్యవేక్షణ శూన్యం

by Disha Web Desk 23 |
సమయం కంటే  ముందే పాఠశాలలకు తాళాలు.. అధికారుల పర్యవేక్షణ శూన్యం
X

దిశ,బయ్యారం : మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు ఏజెన్సీలో విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఉపాధ్యాయులు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైందని ఏజెన్సీలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వేసవి సెలవుల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం మార్చి 15 నుండి ఒక పూట బడులు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించవలసి ఉండగా, బయ్యారం మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో పలు ప్రభుత్వ పాఠశాలల పనితీరు అగమ్య గోచరంగా దర్శనమిస్తున్నాయి. మంగళవారం సుద్ధ రేవు, రెండేళ్ల గడ్డ, కోయగూడెం ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయులు ఉదయం 11 గంటల 05 నిమిషములకే పాఠశాలలు మూసి తాళాలు వేసి ,వారు ఇంటి బాట పట్టారు.

అదే విధంగా కంబాలపల్లి, రామచంద్రపురం పాఠశాల ఉపాధ్యాయులు మధ్యాహ్నం 12.30 విద్యార్థులకు తరగతులు నిర్వహించడం గమనార్హం. ఈనెల 24 నుంచి ప్రభుత్వ పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించడంతో ఏజెన్సీలోని ఉపాధ్యాయులు తమ పాఠశాలలో సమయానికంటే ముందే వెళ్లిపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాఠశాల ఆఖరి పని దినం వస్తే సెలవులన్నీ వర్తిస్తాయని, ఇక్కడి టీచ్చర్లు మొక్కుబడిగా తమ విధులకు వచ్చారని స్థానికులు నుండి ఆరోపణలు బలంగా ఉన్నాయి. దీనిపై స్థానికులను వివరణ కోరగా పాఠశాల రిపోర్టులు ఇవ్వడానికి ఆఫీస్ వెళ్లారని తెలిపారు. దీనిపై మండల ఎంఈఓ పూల్ చంద్ ను వివరణ కోరగా ఈ పాఠశాల ఉపాధ్యాయులు రిపోర్ట్ లు ఇవ్వడం పై నాకు సమాచారం లేదు.అధికారుల సమాచారం తెలుసుకొని పూర్తి సమాచారం తెలుపుతామని బదులిచ్చారు.



Next Story

Most Viewed