అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరూరి..

by Disha Web Desk 11 |
అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరూరి..
X

దిశ, వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో రూ. 8 కోట్లతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్, డివైడర్, వివిధ మౌలిక వసతులు, పలు అభివృద్ధి పనులను వరంగల్ జిల్లా కలెక్టర్ గోపితో కలిసి బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రారంభించారు. అనంతరం వర్ధన్నపేట పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఆంగోత్ అరుణ అధ్యక్షతన నిర్వహించిన వర్ధన్నపేట పురపాలక సంఘం వార్షిక బడ్జెట్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వర్దన్నపేట పురపాలక సంఘం రూ. 2కోట్ల 85లక్షల 30వేలతో ప్రతిపాదించిన 2023-24వార్షిక బడ్జెట్ ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్ధన్నపేట పురపాలక సంఘం ఆదాయ వనరులను పెంపొందించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, పట్టణ పరిధిలో నిర్మించే భవనాలకు తప్పనిసరిగా అనుమతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మున్సిపల్ సిబ్బంది అంకితభావంతో పని చేసి పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలని కోరారు. మున్సిపల్ పాలకవర్గం, అధికారులు సమన్వయంతో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో పట్టణ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అశ్విని తనాజీ వాకడే, వర్దన్నపేట మున్సిపల్ కమిషనర్ రవీందర్, వైస్ చైర్మన్ ఏలెందర్ రెడ్డి, జడ్పీటీసీ మార్గం భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed