ఉద్యమ నాయకుడు కేసీఆర్ సీఎం కావడం అదృష్టం.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

by Disha Web Desk 20 |
ఉద్యమ నాయకుడు కేసీఆర్ సీఎం కావడం అదృష్టం.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
X

దిశ, పాలకుర్తి (కొడ‌కండ్ల‌) : అమ‌రుల త్యాగాల ఫ‌లితంగా ఆవిర్భ‌వించిన తెలంగాణ‌లో ఉద్య‌మ నాయ‌కుడు కేసీఆర్‌ సీఎం కావ‌డం అదృష్ట‌మ‌ని, అమ‌రుల ఆశ‌యాలు, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా స్వ‌రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాల‌న సాగిస్తున్నార‌ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం కొడకండ్ల, ఏనూతుల గ్రామాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సభలకు ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. పార్టీ శ్రేణులు డప్పుచప్పులు, కోలాటాలు, బతుకమ్మలతో మహిళలు ఎర్రబెల్లికి ఘనస్వాగతం పలికారు. మంత్రి ఎర్రబెల్లి మహిళలతో కలిసి బోనం ఎత్తారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ దేశంలో ఎక్క‌డా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తూ, రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాల్లో అగ్ర‌గామిగా తీర్చిదిద్దిన ఘ‌న‌త మ‌న సీఎం కేసీఆర్ కే ద‌క్కుతుంద‌ని అన్నారు. 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చేయని అభివృద్ధిని తొమ్మిది ఏళ్లలో చేసి చూపించిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని అన్నారు.

ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను తిప్పి కొట్టాల‌ని ప్ర‌జ‌ల‌కు, పార్టీ శ్రేణుల‌క పిలుపునిచ్చారు. అభివృద్ధికి పట్టం కట్టి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచానని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నారని ప్రతి సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కొనసాగిస్తున్న ఏకైక నాయక సీఎం కేసీఆర్ మాత్రమే అని అన్నారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కలిసి డీజే పాటలు డ్యాన్సులు చేసి అందర్నీ అలరించాడు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ భోజనం చేసి వారికి వడ్డన చేశారు. ఈ కార్యక్రమంలో కొడకండ్ల మండల పార్టీ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed