కొంత‌మంది అటు ఇటు చేయ‌డంతోనే నా ఓట‌మి.. మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

by Disha Web Desk 23 |
కొంత‌మంది అటు ఇటు చేయ‌డంతోనే నా ఓట‌మి.. మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

దిశ‌,వ‌రంగ‌ల్ బ్యూరో : మ‌హ‌బూబాబాద్ జిల్లా బీఆర్ ఎస్‌లో మ‌రోసారి వ‌ర్గ‌పోరు బ‌య‌ట‌ప‌డింది. గ‌డిచిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొంత‌మంది నేత‌లు త‌ల్లిపాలు తాగి రొమ్మును గుద్దిన‌ట్లు చేశార‌ని, అలా చేయొద్ద‌ని, ఆ కొంత‌మంది నేత‌లు, నాయ‌కుల మోసంతోనే తాను ఓడిపోయానంటూ మ‌హ‌బూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అలా చేయొద్దంటూ చెబుతూనే త‌న‌లోని అసంతృప్తి మాజీ ఎమ్మెల్యే వెళ్ల‌గ‌క్క‌డంతో స‌మావేశంలో అల‌జ‌డి రేగింది. శంక‌ర్‌నాయ‌క్ ఎమ్మెల్సీ ర‌వీంద‌ర్‌రావు వ‌ర్గీయుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా భావించ‌డంతో ఆయ‌న అనుచ‌రులు నిర‌స‌న నినాదాలు చేశారు. లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ అభ్య‌ర్థి క‌విత గెలుపున‌కు శ్రేణులు క‌లిసి క‌ట్టుగా ప‌నిచేయాల‌నే ల‌క్ష్యంతో మంగ‌ళ‌వారం మ‌హ‌బూబాబాద్‌లో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య‌నేత‌ల స‌మ‌న్వ‌య స‌మావేశం శంక‌ర్‌నాయ‌క్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఒక్క‌సారిగా హీటెక్కింది.

ఈ స‌మ‌న్వ‌య స‌మావేశంలో శంక‌ర్‌నాయ‌క్ మాట్లాడుతూ గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లోలా కాకుండా... స‌మ‌న్వ‌యంతో అభ్య‌ర్థి గెలుపున‌కు ప‌నిచేద్దామంటూ పిలుపునిచ్చారు. అయితే త‌న వ్యాఖ్య‌ల‌ను మాత్రం ఆయ‌న స‌మ‌ర్థించుకున్న‌ట్లుగా ప్ర‌సంగం కొన‌సాగింపు చేయ‌డం గ‌మ‌నార్హం. ఈక్ర‌మంలోన స‌మావేశంలో పాల్గొన్న ర‌వీంద‌ర్‌రావు అనుచ‌రుల నుంచి నిర‌స‌న ప్ర‌తివాద‌న‌లు మొద‌ల‌వ‌డంతో ఎంపీ అభ్య‌ర్థి క‌విత‌... శంక‌ర్‌నాయ‌క్ నుంచి మైక్ తీసుకుని జై తెలంగాణ‌... జై కేసీఆర్ అంటూ నిన‌దించి..ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశారు. మాట్లాడుదామంటే.. మాట్లాడుదాం.. కొట్లాడుదామంటే కొట్లాడుదామం అంటూ క‌విత మైక్ లాక్కుని తిరిగి ఇస్తున్న స‌మ‌యంలో శంక‌ర్‌నాయ‌క్ వ్యాఖ్య‌నించ‌డం విశేషం. మంచి వాతావ‌ర‌ణంలో అంద‌రం క‌లిసి ప‌నిచేద్దామంటూ పిలుపునిచ్చారు. ఈ ప‌రిణామంతో స‌మావేశంలో శాంతియుత వాతావ‌ర‌ణం క‌నిపించింది. అయితే శంక‌ర్‌నాయ‌క్ మాస్ వార్నింగ్‌తో స‌భావేదిక‌పై ఉన్న బీఆర్ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌, మాజీమంత్రులు స‌త్య‌వ‌తి రాథోడ్‌,రెడ్యానాయ‌క్‌, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి, ఎమ్మెల్సీ ర‌వీంద‌ర్ రావు అసంతృప్తిగా ఫీల‌య్యారు.



Next Story

Most Viewed