ఆ గుట్ట చుట్టూ అక్రమ నిర్మాణాలు.. పట్టించుకొని దేవాదాయ శాఖ

by Disha Web Desk 23 |
ఆ గుట్ట చుట్టూ అక్రమ నిర్మాణాలు.. పట్టించుకొని దేవాదాయ శాఖ
X

దిశ,హన్మకొండ : ఒకవైపు రైల్వే ట్రాక్, మరో వైపు రోడ్డు మధ్యలో 56 ఎకరాల విస్తీర్ణంలో కొండపై శివాలయం ,శ్రీ సీతా రామ చంద్ర స్వామి,వీరభద్ర స్వామి,తో పాటు కన్ను,కత్తి,స్నానం గుండాలు ఉన్నాయి. గుట్ట పై వెలసిన స్వయం భూ ఆలయాలకు నిత్య ధూప ,దీప,నైవేద్యం కోసం కాకతీయ ప్రభువుల 4 వందల 22 ఎకరాలను కేటాయించారని చరిత్ర చెబుతోంది. వాటిని సేద్యం చేసే రైతులు ఇచ్చిన ధాన్యం తో నిత్యం అన్నదానం నిర్వహించేవారు. చుట్టూ 2 వందల కిలోమీటర్ల నుండి భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించు కొనే వారు. ప్రస్తుతం హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామం లోని హనుమకొండ హైదరాబాద్ రహాదారికి ఆనుకుని ఉన్న దక్షిణ కాశీగా పిలిచే శ్రీ మెట్టు రామలింగేశ్వర దేవాలయం కు ఓ చరిత్ర ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో కొండలు గుట్టలతో దట్టమైన అటవీ ప్రాంతం గా ఉండేది. మణిగిరి గ్రామం గా పిలిచే వారు. మునులు ఈ ప్రాంతంలో తపస్సు చేసినట్లు పురాణాలు చెపుతున్నాయి.మెట్టుగుట్టపై భీముని భార్య గచ్ఛ కాయలు ఆడి ఒకదానిపై ఒకటి పెట్టిందని చుట్టూ 15 కిలోమీటర్లు మేరకు అగుపడుతాయని చెబుతారు.రానురాను మణిగిరి కాస్త మడికొండ గ్రామం గా రూపాంతరం చెందిందని గ్రామస్తులు తెలిపారు.

గత కొన్ని సంవత్సరాల క్రితం కాజీపేట హైదరాబాద్ మధ్య రెండు రైల్వే లైన్లు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఆలయానికి సంబంధించిన 65 ఎకరాలను అప్పటి రైల్వే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం రైల్వే ఆధీనంలో ఉన్న భూముల్లో సగానికి ఎక్కువ గానే ఆలయ భూములు ఉన్నాయని చరిత్ర చెపుతోంది.కాజీపేట మడికొండ చుట్టూ పక్కల గ్రామాలు అభివృద్ధి చెందటం తో క్రమేణా జనాభా పెరిగింది. వారి అవసరాల కోసం అదే స్థాయిలో నిర్మాణాలు కొనసాగాయి. శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయం పేరుపై ఉన్న భూములను ప్రభుత్వం రైల్వే వ్యాగన్ షెడ్ నిర్మాణం కోసం కేటాయించింది. దీనికోసం ప్రభుత్వం 40 కోట్లను బ్యాంకు లో డిపాజిట్ చేయగా 30లక్షల వడ్డీ వస్తుంది. దీనితో ఈ ఆలయం చుట్టూ ఉన్న భూములపై కన్నేసిన కొందరు గుట్ట చుట్టూ ఉన్న భూములను ఆక్రమించుకుని చుట్టూ ప్రహారి గోడలను నిర్మించు కొన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

గ్రామ పంచాయతీ గా ఉన్న కాలం లోనే అక్రమ నిర్మాణాలను ఇంటి నెంబర్ లు కేటాయించగా,కొందరు నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వ పన్ను కట్టకుండా గత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్న కార్పొరేషన్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం వివిధ పార్టీల కార్యకర్తలు గుట్ట చుట్టూ గుడిసెలు వేసి పక్క నిర్మాణాలు చేపట్టగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు అడ్డుకున్నారు. ఆలయ భూముల్లో ఎటువంటి పక్కా నిర్మాణాలు చేపట్ట వద్దని తెలిపిన స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో నిర్మాణాలు చేపట్టడమే కాకుండా రోడ్డు మంచినీటి పైప్ లైన్ విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లిన దేవాదాయ శాఖ అధికారులు దేవాదాయ భూముల పై సర్వే నిర్వహించి 240 ఎకరాల భూములకు హద్దులు ఏర్పాటు చేశారు. ఇందులో కొంత భూమి పక్కనే ఉన్న కడిపికొండ,తరాలపల్లి గ్రామం లో కలిసి పోయిందని రెవెన్యూ అధికారులు గుర్తించారు.

గుట్ట కింది భాగంలో గత కొన్ని సంవత్సరాల క్రితం దేవాలయ భూమికి రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చారని ఆ భూముల్లో నిర్మాణాలు జరిగాయని గుర్తించిన దేవాదాయ శాఖ అధికారులు ఆ నిర్మాణ విషయంలో మౌనం దాల్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయ భూముల్లో స్థానికేతరులు అక్రమ నిర్మాణాలు చేపడుతూ పెత్తం చేలాయిస్తున్నారని అదే కాకుండా స్టాంప్ పేపర్ల పై అమ్మకాలు కోన సాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాజీపేట నుండి మడికొండ,రాంపూర్ వరకు భూములకు అధిక ధరలు ఉండటం తో ఆలయ భూములను ఆక్రమించుకుని రాత్రికి రాత్రే నిర్మాణాలు చేస్తున్నారని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఆలయ భూములను రక్షించి వాటికి కంచెలు ఏర్పాటు చేయాలని ఆలయ భూములను ఆక్రమించితే తొలగించి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని మడికొండ గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story

Most Viewed