ఫాథర్ కొలంబో కల నేడు నెరవేరింది...

by Disha Web Desk 20 |
ఫాథర్ కొలంబో కల నేడు నెరవేరింది...
X

దిశ, హనుమకొండ టౌన్ : హన్మకొండలో ఫాథర్ కొలంబో వైద్యకళాశాలను ప్రారంబించిన మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, పాల్గొన్న చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంపీ దయాకర్, మేయర్ సుధారాణి, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఫాథర్ కొలంబో కల నేడు నెరవేరింది. ఉద్యమ సమయంలో నుండి నేను దీనిగురించి వింటున్నా అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కుల, మతాల తేడా లేకుండా అందరికీ సమావకాశాలు ఇస్తున్నారు అని అన్నారు. 60 ఏళ్లలో 3 ప్రభుత్వ కాలేజీలు ఉంటే, 9 ఏళ్లలో 21 కి చేరింది అని అన్నారు. నాడు ప్రభుత్వ , ప్రైవేటులో మొత్తం 20 మెడికల్ కాలేజీలు ఉంటే నేడు 55కు చేరాయి అని, ఎంబీబీఎస్ సీట్లు నాడు 2950, నేడు 8340 సీట్లు ఉన్నాయి అని అన్నారు. వరంగల్ నగరంలో మూడు మెడికల్ కాలేజీలు ఉండే నగరం అయ్యింది.

మెడికల్ కాలేజీ అంటే 500 పడకల ఆసుపత్రి వస్తది. దీంతో ఇక్కడి వారికి ఉపాధి వస్తుంది. ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అని అన్నారు. భూపాలపల్లి, జనగాంలో మెడికల్ కాలేజీలు వచ్చాయి. ములుగులో మెడికల్ కాలేజీ వస్తుంది అని అన్నారు. మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ పాత మిషన్ ఆసుపత్రి మించి కొలంబో ఆసుపత్రి పని చేయాలని కోరుతున్నా అని అన్నారు. మీరు ప్రజలకు ఉచితంగా, మంచి వైద్యం ఇస్తారని నమ్మకంతోనే ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వచ్చారు అని అన్నారు.


Next Story

Most Viewed