ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థుల అద్భుత ఫలితాలు.. జిల్లాలో టాప్‌గా నిలిచిన మంగపేట

by Disha Web Desk 23 |
ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థుల అద్భుత ఫలితాలు.. జిల్లాలో టాప్‌గా  నిలిచిన మంగపేట
X

దిశ, మంగపేట : మంగపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మీడియట్ ఫలితాల్లో అద్బుత ఫలితాలు సాధించారు. 98.2 శాతం ఉత్తీర్ణతతో ములుగు జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో మంగపేట టాపర్ గా నిలిచింది. ఎంపీసీ విద్యార్థి షేక్ సనా 1000 కి 967 మార్కులతో జిల్లా ప్రథమ స్థానం దక్కించుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ గూళ్ల వెంకటయ్య తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో 112 మంది విద్యార్థులు హాజరు కాగా 110 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 98.2 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఈ ఫలితాలు కళాశాల చరిత్రలోనే ప్రథమం..

షేక్ సనా ఎంపీసీలో 967/1000, ధీగొండ సత్యవర్ధన్ బీపీసీలో 958/౧౦౦౦ మార్కులు సాధించి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ములుగు జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలలోనే ఫస్టు, సెకండ్ టాపర్ లుగా నిలిచినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.

కళాశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు

షేక్ సనా ఎంపీసీ 967, దీగొండ సత్య వర్ధన్ బీపీసీ 958, రైసా అంజుమ్ బీపీసీ 948, ఎండీ.ఆసిఫ్ హుస్సేన్ యంపీసీ 942, సాల్ల సంజన ఎంపీసీ 941, యండి. సల్మా ఎంపీసీ 934, కుంభ జడల రాజేశ్వరి బీపీసీ 915, వేమూనూరి సాయి కిరణ్ .ఎంపీసీ 908, జెజ్జి పూజిత ఎంపీసీ 907,

మానుపెల్లి నవదీప్ ఎంపీసీ 904, శానబోయిన రాహుల్ బైపీసీ 902, పసునూరి విల్సన్ ఎంపీసీ 894, ఎంపెల్లి రూప శ్రీ బీపీసీ 894, బత్తిని రాజేశ్వరి బీపీసీ 843, కోరం రాజేశ్వరి బీపీసీ 833 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ గూళ్ల వెంకటయ్య తెలిపారు.

ప్రథమ సంవత్సరం ఫలితాల్లోను ఫస్టే..

ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల్లో 80 మంది విద్యార్థులు హాజరు కాగా 68 మంది విద్యార్థులు ఉతీర్ణులై 85 శాతం ఉత్తీర్ణత సాధించగా అఫీరా యంపీసీ 453/470 మార్కులతో ప్రథమ సంవత్సరం టాపర్ గా నిలిచినట్లు ప్రిన్సపాల్ తెలిపారు. యండి.హష్మి ఎంపీసీ 447/470, యండి.జాకీర్ పాషా ఎంపీసీ 430/470, గద్ద రాజేశ్వరి బీపీసీ 399/440, ధనుష్ ఎంపీసీ 411/470 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గూళ్ల వెంకటయ్య మాట్లాడుతూ విద్యార్థుల నిరంతర అధ్యయనం కృషి పట్టుదల అధ్యాపకుల నాణ్యమైన బోధన ప్రిన్సిపాల్ నిరంతర పర్యవేక్షణలో ఉన్నతమైన ఫలితాలు సాధ్యమైనట్టు తెలిపారు. కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి కళాశాల, అధ్యాపకుల, తల్లితండ్రుల పేరు నిలబెట్టారని ప్రిన్సిపాల్ గూళ్ల వెంకటయ్య అధ్యాపకులు రేణుకాదేవి, జ్యోతిర్మయి, సంతోష్ కుమార్, లక్ష్మణ, అనిల్ కుమార్, రవీంద్ర నాయక్, శ్రీనివాస్, చిరంజీవి, రాజు, వైష్ణవి, వందనలు హర్షం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed