తెలంగాణ అభివృద్ధి దేశ అభివృద్ధికి నాంది: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

by Disha Web Desk 11 |
తెలంగాణ అభివృద్ధి దేశ అభివృద్ధికి నాంది: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి: తెలంగాణ అభివృద్ధి దేశ అభివృద్ధికి నాంది అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా తొర్రూరు కార్యాలయ భవనం, 1500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంను వరంగల్ డీసీసీబీ, స్కాబ్ ఆర్థిక సహకారంతో రూ.96.62 లక్షల వ్యయంతో నిర్మించిన గోదాం భవనం, కార్యాలయ భవనం, రూ. 24 లక్షలతో రైతు సేవా కేంద్రం, క్యాష్ కౌంటర్ ను ప్రారంభించి మాట్లాడారు.

తొర్రూరు పీఏసీఎస్ లో 1031 మంది రైతులు సభ్యులుగా ఉన్నారని, మొత్తం సభ్యుల వాటా రూ. కోటి 45 లక్షల కాగా సంఘం ద్వారా రుణం పొందిన 2,248 మందికి రూ. 14 కోట్ల 37 లక్షలు అందజేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ కృషి వల్ల రైతులు సంతోషంగా ఉన్నారని, గతంలో రైతులు తీవ్ర ఆందోళనతో అయోమయంలో ఆవేదనతో ఇబ్బందులు ఎదుర్కొనేవారని అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక కరెంట్, నీళ్లు వ్యవసాయానికి ఎదురు పెట్టుబడి ఇచ్చిన మహానుభావుడని కొనియాడారు. సీఎం కేసీఆర్ ఒకవైపు రైతులకు మేలు చేస్తుంటే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కీడు చేస్తున్నదని రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం కుట్ర పన్నుతున్నదన్నారు.

మోడీ హైదరాబాద్ వేదికగా రూ. 200 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నా చెప్పి, రూ. 1250 కి పెంచారని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచిన ప్రజా వ్యతిరేక ప్రభుత్వం బీజేపీ అని, ప్రజలను, రైతులను మోసం చేస్తున్న బీజేపీని ప్రజలు తరిమి కొట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed