సామాన్యులకు అందుబాటులో లేని డిగ్రీ బ్యాక్‌లాగ్ పరీక్ష ఫీజు

by Disha Web Desk 12 |
సామాన్యులకు అందుబాటులో లేని డిగ్రీ బ్యాక్‌లాగ్ పరీక్ష ఫీజు
X

దిశ, కుబీర్: కాకతీయ యూనివర్సిటీ ఇటీవల ప్రకటించిన డిగ్రీ పరీక్ష ఫీజులు సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి. లక్ష్మీ కటాక్షం లేకే సరస్వతికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు వాపోతున్నారు. యూనివర్సిటీ అధికారులు పరీక్షలు రాయడానికి అవకాశం ఇచ్చిన సామాన్యులకు అందుబాటులో లేని విధంగా పరీక్ష ఫీజులను నిర్ణయించడంతో ఇచ్చిన అవకాశాన్ని కోల్పోతున్నామని బ్యాక్ లాగ్ విద్యార్థులు అంటున్నారు. సెమిస్టర్ విధానానికి ముందున్న,ఇయర్ వైస్ పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులకు పరీక్షలు రాయడానికి అవకాశం కల్పించింది. పరీక్ష ఫీజుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరానికి ప్రొఫెషనల్ ఫీజుగా3000₹, ఫెయిల్ అయిన ప్రతి సబ్జెక్టుకు4000₹ పరీక్ష ఫీజుగా‌గా చెల్లించాలి.

ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్, ఫెయిల్ అయిన విద్యార్థులు ప్రొఫెషనల్ ఫీజుగా 9000₹లను, ఒక్కో సబ్జెక్టు పోయిన విద్యార్థులు 12000, చెల్లించాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థుల్లో చాలామంది నిరుపేద, మధ్యతరగతి వారే అధిక సంఖ్యలో ఉన్నారంటున్నారు విద్యార్థులు. అప్పట్లో ఆర్ధిక పరిస్థితులు బాగోలేకే చదువుకోలేక ఫీజుల భారం మోయలేకనే చాలామంది ఫెయిల్ అయామ్ అంటున్నారు. నిరుపేద విద్యార్థుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రొఫైసినల్ ఫీజులను, పరీక్ష ఫీజులు తగ్గించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు యూనివర్సిటీ అధికారులు విద్యారత్తులపై ఆర్థిక భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.



Next Story

Most Viewed