ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు నేనే బాధితుడిని:మాజీ ఐఏఎస్ అధికారి

by Disha Web Desk 18 |
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు నేనే బాధితుడిని:మాజీ ఐఏఎస్ అధికారి
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తాను ప్రత్యక్ష బాధితుడిని అని మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. వివరాలు ఇలా వున్నాయి. ’'కృష్ణా జిల్లా విన్నకోటలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే ఆర్డీఓ వెనక్కి పంపించేశారు. 36 ఏళ్ల పాటు ఐఏఎస్ గా సేవలందించిన అధికారి పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల దుస్థితిని ఊహించలేం'’ అని ఆయన పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తాను ప్రత్యక్ష బాధితుడినని మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ చేసిన ట్వీట్ పై టీడీపీ స్పందించింది. '36 ఏళ్ల పాటు ఐఏఎస్ సేవలందించిన ఉన్నతాధికారి కూడా జగన్ తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ బలయ్యారు. ఇక ఈ భూ దొంగల ముఠా చేతిలో సామాన్యుల పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో, మన ఊహకు కూడా అందదు. చివరకు మీరు కష్టపడి సంపాదించిన మీ సొంత ఇల్లు కూడా మీది కాదు' అని ట్వీట్ చేసింది.

Next Story

Most Viewed