మొదటిసారి లేడీ విలన్ తో బాలయ్య.. బాక్సాఫీస్ బద్దలు కొట్టడానికి సిద్ధం..!

by Kavitha |
మొదటిసారి లేడీ విలన్ తో బాలయ్య.. బాక్సాఫీస్ బద్దలు కొట్టడానికి సిద్ధం..!
X

దిశ, సినిమా: స్టార్ హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్‌‌లో నటించి తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. అయితే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ nbk -109 సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు. కానీ ఈ చిత్రంలో నటిస్తున్న యాక్టర్స్ గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే వెల్లడించలేదు.

అయితే తాజాగా ఈ చిత్రంలో నటి శ్రియా రెడ్డి ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రియా రెడ్డి అంటే కచ్చితంగా నెగిటివ్ షెడ్ కలిగి ఉన్న పాత్రే నటిస్తూ ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే గత ఎడాది ప్రభాస్ నటించిన సలార్ సినిమాలో ఈమె నెగెటివ్ రోల్‌లో నటించడంతో ఈమె రేంజ్ ఎంత పెరిగిపోయిందో మనం చూశాం. బాలయ్య సినిమాలో కూడా మరోసారి తన నటనని ప్రూఫ్ చేసుకోవడానికి శ్రీయా రెడ్డి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ఊర్వశి రౌటేలా, విలన్ గా బాబీ డియోల్, చాందిని చౌదరి తదితరులు నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల ఎన్నికల బిజీలో ఉన్న బాలయ్య అవి ముగియడంతో తిరిగి మళ్ళీ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Next Story