పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో అన్నీ ఇబ్బందులే: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

by Disha Web Desk 11 |
పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో అన్నీ ఇబ్బందులే: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
X

దిశ, కమలాపూర్: బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని, ఎన్నో పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో అన్నీ ఇబ్బందులే తప్ప సాధించింది ఏమీ లేదని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని భీంపల్లి గ్రామంలో ఆదివారం సీఎల్పీ నేత బట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజలను పెడుతున్న ఇబ్బందులను ప్రజానీకానికి స్పష్టంగా తెలియజేయడం కోసమే పాదయాత్ర ప్రారంభించడం జరిగిందని చెప్పారు. తెలంగాణ ప్రజలు మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.

పదవ తరగతి పేపర్ లీకేజీ వ్యవహారంలో బీఆర్ఎస్, బీజేపీలు హంగామా సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఒక రకమైన రాజకీయ హైప్ కోసమే పార్టీ అధ్యక్షుడిని ఎంపీని అరెస్టు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడో జరిగిన ఎన్నికలపై ఇక్కడి బీజేపీ ఎమ్మెల్యే నాటకాలు ఆడుతున్నాడని ఈటల చెప్పేదానికి, చేసేదానికి పొంతనే లేదని తేలిపోయిందన్నారు. కేసీఆర్ అవినీతిలో ఈటల కూడా అతిపెద్ద భాగస్వామని, ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో క్రియాశీల పదవిలో ఉన్నారని ఆరోపించారు.

కేసీఆర్ చిట్టా మొత్తం ఈటెల వద్ద ఉందని ఆ చిట్ట మొత్తం కేంద్ర ప్రభుత్వానికి అందించి చర్యలకు ముందుకెళ్లకుండా మాపై ఏడవడమేంటని విమర్శించారు. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ కు వెళ్లి ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో తప్పకుండా ఇటు రాష్ట్రం అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, 10 సంవత్సరాలు ప్రజల నుంచి దోచుకున్న సంపదను తిరిగి జాతికి అంకితం చేస్తామని అన్నారు.

Also Read..

21 వేల ఎకరాల్లో పంట నష్టం.. CM రివ్యూ చేసిన గంటల్లోనే రిపోర్టు రెడీ!



Next Story

Most Viewed