20 ఏళ్ల క్రితం పునాది.. నేటితో ఆవిష్కరణ పూర్తి..

by Disha Web Desk 20 |
20 ఏళ్ల క్రితం పునాది.. నేటితో ఆవిష్కరణ పూర్తి..
X

దిశ, ఖిలా వరంగల్ : భారత భాగ్య విధాత, బడుగు బలహీనర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్బంగా ఖిలా వరంగల్ పడమరకోట చమన్ వద్ద 37, 38 డివిజన్ల కార్పొరేటర్లు భోగి సువర్ణ, బైరబోయిన ఉమా యాదవ్ ల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేశారు. నలిగంటి అనిల్ అధ్యక్షత సభ నిర్వహించగా గ్రామ పెద్దల సమక్షంలో విగ్రహవిష్కరణ జరిగింది. 20 సంవత్సరాల క్రితం పడమర కోట చమన్ వద్ద అంబేద్కర్ విగ్రహా ఏర్పాటుకు పునాదులు వేయగా నేటితో ఆవిష్కరణ పూర్తికావడంతో 20 ఏళ్ల కల నెరవేరిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

గ్రామంలోని అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అంబేద్కర్ ఆశయ సాధన చాలా గొప్పదని కొనియాడారు. ఇదే విధంగా అందరం కలిసికట్టుగా ఖిలా వరంగల్ అభివృద్ధికి పనిచేయాలని గ్రామ పెద్దలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నలిగంటి పాల్, బండి కోటేశ్వర్, నళిగంటి రత్నమాల, తీగల జీవన్, జూలూరి గౌతమ్, బొడ్డు కుమారస్వామి, బైరబోయిన దామోదర్, భోగి సురేష్, సాగర్ల శ్రీనివాస్, ఇనుముల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed