సొంత బైక్ నే ప్రచారరథంగా మార్చుకున్న అధ్యాపకుడు..

by Disha Web Desk 20 |
సొంత బైక్ నే ప్రచారరథంగా మార్చుకున్న అధ్యాపకుడు..
X

దిశ, హనుమకొండ టౌన్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పదోతరగతి పూర్తయిన విద్యార్థులను ఇంటర్మీడియట్ విద్యకోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ చేయడానికి తన బైక్ నే ప్రచార రథంగా మార్చుకొని విస్తృత ప్రచారం చేస్తున్నాడు ఓ అధ్యాపకుడు. హనుమకొండ జిల్లాలోని శాయంపేట మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనీ కామర్స్ అధ్యాపకుడు చింతల శైలేందర్ తన ద్విచక్రవాహనానికి ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకుని ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా అధ్యాపకుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన విద్య అందిస్తుందన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని గత పది రోజుల నుండి పదవతరగతి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నానని తెలిపారు.

ప్రతి విద్యార్థి వాళ్ళ జిల్లాలో లేదా మండలంలో ఉన్న ఏదైనా ప్రభుత్వ విద్యాసంస్థలలో చదువుకుంటే బాగుంటుందని తెలిపారు. ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ కోర్సులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, హెచ్ఈసీ తెలుగు, ఇంగ్లీష్ మీడియం ఉన్నాయని అన్నారు. అదేవిధంగా విద్యార్థి జాయిన అయిన వెంటనే వేల రూపాయల తెలుగు అకాడమీ పుస్తకాలు ఇస్తారని తెలిపారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ సౌకర్యం ఉంటుందన్నారు. డిజిటల్ క్లాసెస్ కూడా బోధిస్తారు, కెరియర్ గైడెన్స్, ఎంసెట్ కోచింగ్, ప్రతి వారం విద్యార్థులకు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారని తెలిపారు.


Next Story