హుజూరాబాద్‌ను జిల్లా చేయాలని వాకర్స్ అసోసియేషన్ ర్యాలీ

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-06 06:24:57.0  )
హుజూరాబాద్‌ను జిల్లా చేయాలని వాకర్స్ అసోసియేషన్ ర్యాలీ
X

దిశ, హుజురాబాద్ : హుజూరాబాద్‌ను వెంటనే జిల్లాగా ప్రకటించాలని కోరుతూ శుక్రవారం ఉదయం వాకార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హై స్కూల్ మైదానం నుండి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజూరాబాద్‌ను హుస్నాబాద్ నియోజక వర్గాలను కలుపుకుని జిల్లాగా ప్రకటించాలని కోరారు. ఈ ప్రతిపాదన గతంలో ఉన్నా నాయకులు పట్టించుకోకపోవడం మూలంగా మరుగున పడి పోయిందని అన్నారు.

పక్కనే ఉన్న హన్మకొండ కన్నా భౌగోళికంగా అన్ని వసతులు ఉన్న హుజూరాబాద్ ను జిల్లాగా చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. జిల్లాగా చేసే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయ వాది ముక్కెర రాజు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గోవర్ధన్, వర్దినేని రవీందర్ రావు, ఈశ్వర్ రెడ్డి, పాక సతీష్, గూడూరి స్వామి రెడ్డి, పొడిశెట్టి వెంకట్ రాజం, సొల్లు బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story