ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు..

by Disha Web Desk 11 |
ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు..
X

దిశ, ఏర్గట్ల: మండల కేంద్రంలో నివాసముంటున్న సుదన వేణి రాజ్ కుమార్ గౌడ్ (46), పుట్టుకతో వికలాంగుడు. ఇతని భార్య అంధురాలు వీరిది నిరుపేద కుటుంబం. వీరికి సంతానం కూడా లేకపోగా వీరికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వికలాంగ పెన్షన్ డబ్బుతోనే బతుకుకీడుస్తున్నారు. వేరే జీవనాధారం లేదు. ఇంతలోనే ఇతడికి ఆదివారం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో నిజామాబాదులోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. చేతిలో రూపాయి లేకపోవడంతో ఈ నిరుపేద కుటుంబానికి ఎవరు ఆదుకుంటారని ఎదురుచూస్తున్నారు.

ఆపరేషన్ ఖర్చుల కొరకు రెండు నుండి మూడు లక్షల రూపాయలు అవసరం కాగా చేతిలో డబ్బులు లేక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి తన భర్తను ఆదుకోవాలని రాజ్ కుమార్ భార్య వేడుకుంటోంది. దాతలు 9908319762 కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా తమ వంతు సాయం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.


Next Story

Most Viewed