ఆందోళనకు సిద్ధమవుతున్న వైద్యవిధాన పరిషత్​ డాక్టర్లు

by Dishafeatures2 |
ఆందోళనకు సిద్ధమవుతున్న వైద్యవిధాన పరిషత్​ డాక్టర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యారోగ్యశాఖ లోని వివిధ విభాగాల స్టాఫ్ తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు సరికొత్త విధానంలో ముందుకు వెళ్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమీపిస్తుండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఫిక్స్​అయ్యారు. ఎన్నికల తర్వాత సమస్యలు పరిష్కారం కావనే అభిప్రాయంలో హెల్త్ స్టాఫ్​ఉన్నది. దీంతో సమ్మెలు చేయాలని ప్లాన్ చేశారు.దీనిలో భాగంగానే మెడికల్ కాలేజీలలోని డాక్టర్లు రెండు రోజుల క్రితం సర్కార్​కు అల్టిమేటం ఇచ్చారు. వారం రోజుల లోపు తమ ఇబ్బందులను తొలగించకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఇక సెకండ్ ఏఎన్​ఎంలు కూడా తమకు 15 రోజుల్లో న్యాయం చేయకపోతే పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ సోమవారం కోఠిలో ధర్నా చేశారు. దీంతో పాటు తెలంగాణ వైద్య విధాన పరిషత్ డాక్టర్లు కూడా సమ్మె చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఆ తర్వాత స్టాఫ్​ నర్సులు కూడా తమ సమస్యల కోసం ప్రణాళికను రెడీ చేస్తున్నది.

ఎన్నికల వేళ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తేనే ఇష్యూస్​ ను ప్రభుత్వం అడ్రస్​ చేస్తుందనే అభిప్రాయంలో కొవిడ్ వారియర్స్​ఉన్నారు. దీంతో వైద్యశాఖ లో ఇప్పుడు వ్యవస్థ ఆగమాగం ఉన్నది. పీఆర్​సీ, ట్రాన్స్ ఫర్ల విషయంలో జోక్యం చేసుకోవాలని డీఎంఈ డాక్టర్ల ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగా, డాక్టర్లకు టార్గెట్లు, ప్రమోషన్లు వంటి విషయాలపై తెలంగాణ వైద్య విధాన పరిషత్ డాక్టర్లు సర్కార్ పై పోరాటానికి దిగనున్నారు.అంతేగాక సెకండ్ ఏఎన్ఎంలకు రూ. 41 వేల వేతనంతో పాటు, 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, కారుణ్య నియామకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక నర్సింగ్ డైరెక్టరేట్ ,హోదా, కౌన్సిల్ ఎన్నికలు, సాలరీ పెంపు పై నర్సులు ఆందోళనకు దిగనున్నారు. మంత్రి హమీ మేరకు ఇన్నాళ్లు మౌనంగా ఉన్నామని, కానీ ఆయన కూడా తమ సమస్యలను అడ్రస్​ చేయడం లేదని, కేవలం రివ్యూలు పెడుతూ డాక్టర్లపై ప్రెజర్​తీసుకువస్తున్నాడని డీఎంఈ డాక్టర్ల సంఘం లోని ఒకరు తెలిపారు.


Next Story