ఆ ఒక్క ట్వీట్‌తో సీన్ మొత్తం రివర్స్.. కేటీఆర్‌కు ఊహించని షాక్!

by Disha WebDesk |
ఆ ఒక్క ట్వీట్‌తో సీన్ మొత్తం రివర్స్.. కేటీఆర్‌కు ఊహించని షాక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కేటీఆర్.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలిగే సామర్థ్యం కలిగిన వ్యక్తి. టీఆర్ఎస్ భవిష్యత్ సీఎంగా చెప్పబడుతున్న కేటీఆర్ పై సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పొలిటీషియన్స్ జాబితాలో ముందు వరుసలో ఉంటారు. అయితే ఇటీవల కేటీఆర్ ట్వీట్లు తరచు విమర్శలకు గురవుతుండడం టీఆర్ఎస్ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. తాజాగా కేటీఆర్ చేసిన ఓ ట్వీట్ రాజకీయ రచ్చకు తెరలేపింది. సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తన దత్తత గ్రామమైన రంగారెడ్డి జిల్లా కేశంపేట పరిధిలోని కొండారెడ్డిపల్లిని ఉద్దేశించి కేటీఆర్ రెండు రోజుల క్రితం ఓ ట్వీట్ చేశారు. 'ఇది ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకున్న గ్రామం.. స్థానిక ఎమ్మెల్యేతో కలిసి అద్భుతంగా డెవలప్ చేశారు' అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ఆ గ్రామ ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. ప్రకాశ్ రాజ్ ను మంత్రి ప్రశంసించడంపై ఆ గ్రామ సర్పంచ్ మండిపడ్డారు. బుధవారం గ్రామస్తులతో కలిసి సర్పంచ్ పల్లె స్వాతి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ తీరుపై విమర్శలు గుప్పించారు. గ్రామాభివృద్ధి విషయంలో మంత్రి కేటీఆర్ పూర్తి సమాచారం తెలుసుకుని మాట్లాడితే బాగుండేదని ఫైర్ అయ్యారు. 2019 వరకే ప్రకాశ్ రాజ్ తమ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని, ఆయన చేసిన దానికంటే తామే సొంత నిధులతో చేసిన అభివృద్ధి ఎక్కువ అని చెప్పుకొచ్చారు. గత మూడేళ్లుగా సొంత నిధులతో గ్రామాభివృద్ధి చేసుకుంటున్న తమను ప్రశంసించాల్సింది పోయి ఆ క్రెడిట్ అంతా ప్రకాశ్ రాజ్ కు ఇవ్వడం ఎంతవరకు రైట్ అంటూ ప్రశ్నించారు. అభివృద్ధి తాము చేసుకుంటే అప్రిసియేషన్ ప్రకాశ్ రాజు కు ఇవ్వడం ఏంటని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటననే కాదు కేటీఆర్ చేస్తున్న ట్వీట్లపై నెటిజన్లు తరచూ విమర్శలపాలవుతున్నాయి.

నెమలీకలు సరే విద్యార్థుల ఆకలి కేకలు వినబడటం లేదా?

ఈ నెల 19వ తేదీన కేటీఆర్ చేసిన ట్వీట్ పై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద తన పిల్లాడు నెమలి నుండి జారిపడిన ఈకలను తీసుకుంటే సిబ్బంది అడ్డుకున్నారని ఓ తల్లి రాసిన లేఖపై మంత్రి కేటీఆర్ స్పందించారు. పార్క్ లో పడిపోయిన నెమలి ఈకలను తీసుకువెళ్లేందుకు చిన్నారులకు అనుమతి ఇవ్వాలని కేబీఆర్ పార్క్ అధికారులను నేను కోరుతున్నానంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై నెటిజన్లు మండిపడ్డారు. చిన్నారి తల్లి లేఖకు స్పందించారు సరే రాష్ట్రంలోని విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రుల పాలవుతున్నారు వీరి తల్లులకు ఎవరు సమాధానాలు రాస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెమలి ఈకలు అటే తమకూ ఇష్టమే కానీ విద్యార్థుల ఆకలి కేకలు మీకు కనబడటం లేదా అంటూ విరుచుకుపడ్డ తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రతిపక్షాలకు ఆయుధంగా కేటీఆర్ ట్వీట్‌లు

మంత్రి కేటీఆర్ ట్వీట్లపై వివాదాలు చుట్టుముట్టడం తరచూ జరుగుతూనే ఉంది. కేటీఆర్ ట్వీట్లను ప్రతిపక్షాలు, నెటిజన్లు తరచూ టార్గెట్ గా చేసుకోవడం కేటీఆర్ ఫాలోవర్స్ ను షాక్ కు గురి చేస్తోంది. పొలిటికల్ గా కేటీఆర్ చేస్తున్న ట్వీట్లు ఈ మధ్య కాలంతో రచ్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా కేటీఆర్ చేసే ట్వీట్లకు బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తోంది. జాతీయ స్థాయి నేతలు సైతం కౌంటర్లు ఇస్తుండటం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇదే సమయంలో కొన్ని ట్వీట్లు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల తన కాలుకు సర్జరీ జరిగిన సందర్భంలో ఓటీటీలో ఏ సినిమాలు చూడాలో చెప్పాలంటూ కేటీఆర్ కోరిన ట్వీట్ పై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పోయి సినిమాలు సూచించాలని కోరుతారా అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అయితే ఆ వెంటనే తన ఇంటి నుండే శాఖపై రివ్యూ మీటింగ్ నిర్వహించిన ఫోటోలను షేర్ చేసి ఆ దుమారానికి చెక్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే టాక్ వినిపిచింది. ఇక నెటిజన్ల విషయంలో కేటీఆర్ పై ట్రోల్స్ ఓ రేంజ్ లో ఉంటున్నాయనే చర్చ ఉంది.

We are Hiring SEO Executive for Telugu News website.
For more details Click here
Send us your resume to:[email protected] / Whatsapp 8886424242

Next Story

Most Viewed