ప్రతి నెల రూ.4 వేల నిరుద్యోగ భృతి: రేవంత్ రెడ్డి సంచలన హామీ

by Disha Web Desk 19 |
Revanth Reddy will not Participate in Munugode Padayatra Due to Covid Symptoms
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉద్యమంలో 60 ఏళ్ళు పోరాడిన తెలంగాణ ఆకాంక్షలు నేరవేరలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం టీ కాంగ్రెస్ సరూర్ నగర్ స్టేడియంలో తలపెట్టిన యువ సంఘర్షణ సభకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌కు విచ్చేసిన ప్రియాంక గాంధీకి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్వాగతం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ యూనివర్శిటీలు కేవలం విశ్వ విద్యాలయాలు కాదని.. ఓయూ, కాకతీయ ఆత్మగౌరవ ప్రతీకలు అని అన్నారు. తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాన్ని గొంతెత్తి చాటిన వేదికలన్నారు.

వర్సిటీలు తెలంగాణ పౌరుషానికి వేదికలుగా నిలిచాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీల సంఖ్య 12.5 లక్షలు ఉండగా.. రాష్ట్ర విభజన వేళ తెలంగాణకు 5.3 లక్షల ఉద్యోగాలు కేటాయించారన్నారు. 5.3 లక్షల ఉద్యోగాల్లో తొలి ఏడాది 1.7 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీఆర్ మాటిచ్చారన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 2.5 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని.. కానీ 9 ఏళ్లు పూర్తైన ఇప్పటికీ పోస్టులు భర్తీ చేయట్లేదని మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ అండగా నిలుస్తోందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి నిరుద్యోగి నెలకు రూ. 4 నిరుద్యోగ భృతి ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.


Next Story

Most Viewed