TSPSC ఛైర్మన్ ఖరారు.. గవర్నర్ ఆమోదానికి సిఫారసు!

by Disha Web Desk 2 |
TSPSC ఛైర్మన్ ఖరారు.. గవర్నర్ ఆమోదానికి సిఫారసు!
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని నిన్న (సోమవారం) రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. వచ్చి రాగానే టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకంపై దృష్టి పెట్టారు. బోర్డు ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారులను నియమించాలని ప్రభుత్వం ముందు నుంచే ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఛైర్మన్ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించినట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువ ప్రాధాన్యత మహేందర్ రెడ్డికే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు విస్తృతమయ్యాయి. ఈ పోస్టు కోసం మొత్తం 50 మంది దరఖాస్తు చేసుకున్నారు.

అందులో ముగ్గురిని ఎంపిక చేసి.. చివరగా మహేందర్ రెడ్డి పేరును గవర్నర్ ఆమోదానికి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల ప్రశ్నాపత్రాలన్నీ లీకై పెద్ద ఎత్తున దుమారం రేగిన విషయం తెలిసిందే. దీంతో గత ప్రభుత్వం చేసిన తప్పులు మళ్లీ రిపీట్ కాకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. అంతేకాదు టీఎస్‌పీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి యూపీఎస్సీ చైర్మన్‌ను కలిసి చర్చించారు.



Next Story

Most Viewed