పదేండ్ల తర్వాత తెలంగాణకు నిజమైన ప్రజాస్వామ్యం: ప్రొ. హరగోపాల్

by Disha Web Desk 19 |
పదేండ్ల తర్వాత తెలంగాణకు నిజమైన ప్రజాస్వామ్యం: ప్రొ. హరగోపాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఒక ప్రజాస్వామిక వాతావారణం, తెలంగాణ ఇప్పుడే వచ్చిందా అనే ఫీలింగ్ ప్రజలకు కలుగుతుందని ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు. ఆదివారం తెలంగాణ విభజన హామీల అమలు – కేంద్ర ప్రభుత్వ వివక్షపై టీజేఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర సదస్సులో అయన మాట్లాడుతూ.. తొమ్మిదిన్నర ఏండ్ల కాలం ప్రజలు తమ బాధను, కష్టాలను ఎవరికీ చెప్పుకోలేక అనేక ఇబ్బందులకు గురయ్యారన్నారు. ప్రజా భవన్‌కు ప్రజలు రాష్టం నలుమూలలనుండి వచ్చి అన్యాయానికి గురైన బాధితులు తమ గోడును వెళ్లబోసుకుంటుంటే ప్రజాస్వామ్యం ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిందని ప్రజలు ప్రశ్నించుకునే స్థాయికి చేరిందన్నారు. విభజన జరిగినప్పుడు కలిగిన ఆనందం ఈ పదేళ్లలో ఎందుకు నీరుగారిపోయిందని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో మాఫియా కల్చర్ వచ్చిందని, దీనిని ఎలా తట్టుకుంటారని రోశయ్య సీఎంగా ఉన్నప్పుడే ఓ టీవీ డిబేట్‌లో అడిగితే ఆయన నిజమేనని ఒప్పుకున్నారు. తెలంగాణ వచ్చాక హైదరాబాద్ చుట్టుపక్కల భూ ఆక్రమణలు పెరిగాయన్నారు. తెలంగాణను క్యాప్చర్ చేసిందనే విషయాన్ని విశ్లేషించుకోవాలన్నారు. ఇలాంటి విలువల్లేని, విధ్వంసం చేసే వ్యక్తుల నుంచి భవిష్యత్ తెలంగాణను ఎలా కాపాడుకోవాలో ఆలోచించాలని అన్నారు. విద్యాహక్కు కోసం 30 మంది టీచర్లం అమరవీరుల స్థూపం దగ్గర ర్యాలీ తీస్తామంటే తనను అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హక్కుల మీద జరిగిన దాడి తెలంగాణలోనూ కొనసాగిందన్నారు. గత పదేళ్లలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.

Next Story