నిషేదిత భూములు కొంటున్న టీఆర్ఎస్ లీడర్స్

by Dishanational2 |
నిషేదిత భూములు కొంటున్న టీఆర్ఎస్ లీడర్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నిషేదిత జాబితాలో ఉన్న భూములను తక్కువ ధరకు టీఆర్ఎస్ లీడర్లు కొనుకుంటున్నారని, నిషేదిత జాబితా నుంచి భూమిని తీసేసుకుంటున్నారని కాంగ్రెస్ జాతీయ కిసాన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్ చాలా కీలకమైందని, దాన్ని సీఎం కేసీఆర్ చిన్నాభిన్నం చేశారని ఆయన విమర్శించారు. 2017లో రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని, ఐదేండ్లు గడిచిన కూడా చేయలేదని మండిపడ్డారు. భూ సమస్యలపై సీఎస్ సోమేశ్ కుమార్‌కు వినతిపత్రం ఇచ్చామని, నెల రోజులైనా దానిపై సీఎస్ రిప్లై లేదని అన్నారు. భూ సమస్యలపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్‌ కార్యక్రమం పై చర్చించి, త్వరలో ప్రకటిస్తామన్నారు. 'ధరణి' సమస్యలతో రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

కేసీఆర్‌కు కాదు.. రాష్ట్రానికి సీఎస్ అని గుర్తుంచుకో..

రాష్ట్రంలో సన్నకారు రైతులు, ధరణి పోర్టల్ వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని ఓ రిపోర్ట్ సీఎస్ కు ఇచ్చినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సీఎస్ సోమేశ్ కుమార్ కు గంట సేపు వివరించిన స్పందన లేదని విమర్శించారు. కేసీఆర్ కు మాత్రమే సీఎస్ కాదు.. రాష్ట్రానికి సీఎస్ అని గుర్తుచేసుకోండి అంటూ ఎద్దేవా చేశారు. ప్రధాన ప్రతిపక్షం ప్రజా సమస్యలపై వినతిపత్రం ఇచ్చిన ఆన్సర్ లేదా? వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మూడ్‌లో ఉన్నారని, మళ్లీ అధికారంలోకి ఎలా రావాలి, కేటీఆర్‌ను ఎలా సీఎం చెయ్యాలో అనే ఆలోచనలో సీఎం ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Next Story