వంట గ్యాస్ ధర తగ్గింపుపై TPCC చీఫ్ రేవంత్ రెడ్డి సెటైర్

by Disha Web Desk 19 |
వంట గ్యాస్ ధర తగ్గింపుపై TPCC చీఫ్ రేవంత్ రెడ్డి సెటైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ పై రూ.200 తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఒక గజదొంగ దారిదోపిడీ చేసి సర్వం దోచుకున్న తర్వాత దారి ఖర్చుల కోసం రూ.200 ఉంచోకోమని ఇచ్చిననట్లుగా కేంద్ర ప్రభుత్వం వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో గ్యాస్ బండ ధర రూ.410 ఉంటే దానిని మోడీ అధికారంలోకి వచ్చాక రూ. 1200 చేశారని దుయ్యబట్టారు. ఇన్నాళ్లు పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బందుల పాలు చేసి తీరా ఇప్పుడు గ్యాస్ ధర తగ్గించడాన్ని ఇలా కాకుండా మరెలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.



Next Story

Most Viewed