కేసీఆర్ స్వార్ధానికి కాళేశ్వరం ప్రాజెక్టు 21,22 ప్యాకేజీ బలైంది

by Dishafeatures2 |
కేసీఆర్ స్వార్ధానికి కాళేశ్వరం ప్రాజెక్టు 21,22 ప్యాకేజీ బలైంది
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కేసీఆర్ స్వార్ధానికి కాళేశ్వరం ప్రాజెక్టు 21,22 ప్యాకేజీ బలైందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. హాథ్ సే హథ్ జోడో పాదయాత్ర సంధర్బంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప రిజర్వాయర్ ( కోండేం చెరువు) పనులను టీపీసీసీ చీప్ రెవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జలయజ్ఞంలో భాగంగా వైయస్ హయంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ చేపట్టిందని, ఆ ప్రాజెక్టుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టి వారి గొప్పదనాన్ని చాటాలని అనుకుందన్నారు. కానీ 900 కోట్లకు పైగా ఖర్చు చేసి 75 శాతం పనులు పూర్తి చేస్తే తొమ్మిదేళ్లయినా 21వ ప్యాకేజీ పనులు పూర్తి కాలేదు సరికదా ఆయన స్వార్ధానికి కాళేశ్వరం ప్రాజెక్టు 21,22 ప్యాకేజీ బలైంది అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. జలయజ్ఞంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి పథకంలో భాగంగా ప్యాకేజీ 21,22 పనులను చెపట్టిందన్నారు.

కొండెం చెరువు కెపాసిటీ 0.84 టీఎంసీ సామార్థ్యంలో ఈ ప్రాంతంలో పేదల భూములు ముంపుకు గురవుతాయని ఉన్నదాంట్లోనే లక్ష 83వేల ఎకరాకు నీరివ్వాలనుకుంది అన్నారు. ఇంకో 300కోట్లు ఖర్చ చేస్తే ఈ ప్రాంతానికి సాగు నీరు అందేది అన్నారు. కేసీఆర్ హయాంలో ఆయన స్వార్ధానికి ఈ ప్యాకేజీ బలైందని ఆయన అవినీతికి ఈ ప్రాజెక్ట్ ఒక ఉదాహరణ అన్నారు. ఓక్క ఎకరం సాగు విస్థిర్ణం పెరుగకున్న రూ.3500 కోట్లకు ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచారు అని ఆరోపణలు చేశారు. కోత్తగా రిడిజైన్ వలన భూసేకరణతో 10గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని, ఆయకట్టు పెరగక పోయినా ఇక్కడి పేదలను భూ నిర్వాసితులను చేశారు అని అన్నారు.

300 కోట్లకు పూర్తి కావాల్సిన ప్రాజెక్టును 3500 కోట్లకు పెంచారని ఉమ్మడి రాష్ట్రంలోలాగానే కేసీఆర్ పాలనలో అదే వివక్ష కొనసాగుతోంది అని తెలిపారు. భూములు కోల్పోయిన రైతులు నిరసన తెలిపితే 307 సేక్షన్ కేసులు పెట్టారు అని , 17మంది ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు అన్నారు. వారిపై కేసులను బే షరతుగా ఉపసంహరించుకుని విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. తొమ్మిదేళ్లయినా 21వ ప్యాకేజీ పనులు పూర్తి కాలేదు అని కేసీఆర్ ది దుర్మార్గమైన చర్య అన్నారు. కాళేశ్వరం ప్యాకేజీ 21,22 రీడిజైన్ ను వెనక్కు తీసుకుని.. పాత డిజైన్ ప్రకారం ప్రాజెక్టు నిర్మించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితుల పోరాటానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది అని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.



Next Story

Most Viewed