వందలో ముగ్గురికి కొవిడ్! అలర్ట్‌గా ఉండాలంటున్న హెల్త్ డిపార్ట్‌మెంట్

by Disha Web Desk 4 |
వందలో ముగ్గురికి కొవిడ్! అలర్ట్‌గా ఉండాలంటున్న హెల్త్ డిపార్ట్‌మెంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టెస్టులు చేస్తున్న ప్రతి వంద మందిలో ముగ్గురికి వైరస్ నిర్ధారణ అవుతున్నది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో అతి స్వల్పంగా ఉన్న కరోనా కేసులు మార్చి రెండో వారం నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి 13 నుంచి 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 31,218 మందికి కరోనా టెస్టులు చేయగా,749 మందిలో వైరస్​ఉన్నట్లు గుర్తించారు. సగటున పాజిటివ్​రేటు 2.40 శాతంగా నమోదైంది. అంటే టెస్టులు చేస్తున్న ప్రతి వందలో సుమారు ఇద్దరిపై వైరస్​ఎటాక్​చేసింది. మార్చి20 నుంచి 26 వరకు 29,507 మందికి కరోనా టెస్టులు చేయగా, 757 మందిలో కొవిడ్​తేలింది. స్టేట్​అవరేజ్​పాజిటివ్​రేట్​2.57 శాతంగా నమోదైంది. అంటే కనీసం ఇద్దరికి తగ్గకుండా బాధితులు తేలడం గమనార్హం.

హైదరాబాద్‌లో వందలో నలుగురు

జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో గతంతో పోల్చితే వైరస్​వ్యాప్తి పెరిగింది. అర్బన్​ఏరియాల్లో కొవిడ్​వ్యాప్తి కాస్త ఎక్కువగా ఉండగా, రూరల్‌లో నెమ్మదిగా కొనసాగుతున్నది. మార్చి 20 నుంచి 26 వరకు హైదరాబాద్‌లో 9,948 మందికి కరోనా టెస్టులు చేయగా, 454 మందికి వైరస్​తేలింది. పాజిటివ్ రేటు​4.56 శాతంగా నిర్ధారణ అయింది. అంటే టెస్టులు చేయించుకుంటున్న ప్రతి వందలో నలుగురి కన్నా ఎక్కువ మందికి కొవిడ్ కన్ఫామ్​అవుతున్నది. ఇక రంగారెడ్డిలో ప్రతి వందలో ముగ్గురు, మేడ్చల్‌లో ఇద్దరిలో కరోనా కనిపిస్తున్నది.

కరీంనగర్‌లో కొవిడ్ వైరస్​పాజిటివ్​రేట్​ 4.46 శాతం, సంగారెడ్డిలో 6.96 శాతం, యాదాద్రిలో 3.51 శాతం, నిజామాబాద్‌లో 2.25 శాతం, మెదక్​లో 6.31 శాతం, కామారెడ్డిలో 4.36 శాతం, ఆదిలాబాద్‌లో 3.28 శాతం, మహబూబ్‌నగర్‌లో 2.03 శాతం, సిద్ధిపేట్‌లో 3.70 శాతం, నల్లగొండలో 0.88 శాతం, వికారాబాద్‌లో 3.87 శాతం, రాజన్న సిరిసిల్లో 5.11 శాతం, మహబూబాబాద్‌లో 3.45 శాతం, పెద్దపల్లిలో 4.55 శాతం, హనుమకొండలో 0.85 శాతం, ఖమ్మంలో 0.99 శాతం, మంచిర్యాలలో 2.29 శాతం, వరంగల్‌లో 1.16 శాతం, సూర్యాపేట్‌లో 0.80 శాతం, నారాయణపేట్‌లో 0.10 శాతం, నిర్మల్‌లో 2.78 శాతం, యాదాద్రిలో 0.85 శాతం, భద్రాద్రిలో 0.09 శాతం, జగిత్యాలలో 0.48 శాతం చొప్పున పాజిటివ్ రేట్​నమోదైంది. అయితే జనగామ, జయశంకర్, జోగులాంబ, కొమరం భీమ్, ములుగు జిల్లాల్లో కరోనా తీవ్రత లేదని ఆరోగ్యశాఖ అధ్యయనంలో నిర్ధారణ అయింది.

చిన్నారులు, వృద్ధులు జాగ్రత్త..

పదేళ్ల లోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబడిన వారు అప్రమత్తంగా ఉండాలి. దీర్ఘకాలిక రోగులు, గర్భిణులు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రోగ నిరోదక శక్తి తక్కువగా ఉండడంతో వేగంగా వైరస్​ఎటాక్​చేసే చాన్స్ ఉన్నది. గ్రూప్​గేదరింగ్స్‌కు​దూరంగా ఉండాలి. ప్రస్తుతం వైరస్ తీవ్రత సాధారణంగా ఉన్నది. ఒకే రోజు పాజిటివ్ రేట్​పదికి మించితే వైరస్​వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు లెక్క. నియంత్రణ చర్యల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉంటుంది. కరోనా కఠిన పరిస్థితులు దాటిపోయాం.

- గడల శ్రీనివాసరావు, డీహెచ్

మార్చి 20 నుంచి 26 వరకు

వైరస్ ​తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు

జిల్లా శాంపిళ్లు కేసులు పాజిటివ్​రేట్​

హైదరాబాద్ 9948 454 4.56

రంగారెడ్డి 1512 56 3.70

మేడ్చల్ 3022 37 1.22

కరీంనగర్ 740 33 4.46

సంగారెడ్డి 474 33 6.96

యాదాద్రి 713 25 3.51

మెదక్​ 222 14 6.31

కామారెడ్డి 275 12 4.36

వికారాబాద్ 181 7 3.87

నేటి నుంచి కొవిడ్ మాక్‌డ్రిల్

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి కొవిడ్ మాక్ డ్రిల్ ప్రారంభం కానుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రెండు రోజులపాటు నిర్వహించనున్నారు. విదేశాలతో పాటు మన రాష్ట్రంలోనూ కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కొవిడ్​నియంత్రణ ఏర్పాట్లలో భాగంగా అన్ని ఆస్పత్రుల్లో వార్డులు, టెస్టింగ్ కిట్ల, మందులను పరిశీలిస్తారు. మిషన్లు, పరికరాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్లు తదితర వాటి పనితీరును పర్యవేక్షిస్తారు. ప్రతి జిల్లాకు ఓ నోడల్​ఆఫీసర్​ మాక్​డ్రిల్‌ను పర్యవేక్షిస్తారు.


Next Story

Most Viewed