పార్టీని విడిచిపెట్టే వారు పవర్ బ్రోకర్లు!.. హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు

by Disha Web Desk 5 |
పార్టీని విడిచిపెట్టే వారు పవర్ బ్రోకర్లు!.. హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ లోని కీలక నేతలు పార్టీ మారడంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మె్ల్యే హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ మార్పులపై స్పందించారు. తెలంగాణలో నిన్న, ఇవ్వాళ జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు చూస్తున్నామని, కొంత మంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది మనకు ఏమన్నా కొత్తనా అని, తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టుమని పది మంది లేకున్నా కేసీఆర్ ఉద్యమాన్ని ప్రారంభించారని, రానే రాదు.. కానే కాదు అన్న తెలంగాణని తెచ్చి పెట్టాడని తెలిపారు. అంతేగాక ఇప్పుడు ఆకులు రాలే కాలం నడుస్తొందని, ఈ రుతువులో పనికిరాని ఆకులన్నీ రాలి చెత్తకుప్పలో కలిసిపోతున్నాయని, మూలం మాత్రం అలాగే ఉంటుందని, కొన్ని రోజుల తర్వాత కొత్త చిగుర్లు వస్తాయని తెలిపారు. అలాగే కొన్ని ఆకులు రాలినట్టు కొంతమంది పనికి రాని నాయకులు పోవచ్చు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ అలాగే ఉంటుందని చెప్పారు.


Next Story

Most Viewed