వీళ్లు మామూలు దొంగలు కారు.. వాహనంలో వచ్చి దర్జాగా 30 గొర్రెలు, మేకలను..

by Disha Web Desk 4 |
వీళ్లు మామూలు దొంగలు కారు.. వాహనంలో వచ్చి దర్జాగా 30 గొర్రెలు, మేకలను..
X

దిశ, గాంధారి/సదాశివనగర్: సాధారణంగా దొంగలంటే బంగారము, డబ్బులు, బైకులు, విలువైన వస్తువులు దొంగలించడం చూస్తుంటాం. కానీ దొంగలు సైతం ఆశ్చర్యపోయే విధంగా కొత్త రకం దొంగతనాలకు దుండగులు పాల్పడుతున్నారు. ఏకంగా 30 కి పైగా గొర్రెలు, నాలుగు మేకలను రాత్రికి రాత్రి ఎత్తుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి. సదాశివ నగర్ మండలం తిమ్మాజీ వాడి గ్రామం ఎర్రం మల్లయ్య కురుమ నరసయ్య సంబంధించిన మేకలు, గొర్రెలు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

అయితే నిన్న రాత్రి గుర్త తెలియని వాహనంలో వచ్చిన దొంగలు ఇంటికి బయట నుంచి గడియ పెట్టారు. అనంతరం ఇంటి ముందు ఉంచిన గొర్రెలు, మేకలను ఎత్తుకెళ్లారు. వాహనంలో వచ్చినట్లు ఇంటి ముందు ఆనవాళ్లు ఉన్నాయి. చప్పుడైతుందని ఎర్రం మల్లయ్య భార్య భూమవ్వ చూసి లేచేసరికి ఎంత తీసిన డోర్లు రావడం లేదని పక్క వారికి కేకలు వేస్తూ తెలుపగా అప్పటికే దొంగలు బండ్లో గొర్లను మేకలను వాహనంలో వేసుకుని దొంగలు ఉడాయించారు. ఇది వరకే ఏప్రిల్ 22న ఇలాగే ఇంటికి గడియ పెట్టారని ఆ రోజు దొంగతనం చేయకుండా వెళ్లిపోయారని ఎర్రం మహేష్ తెలిపారు. కానీ నిన్న పక్క ప్లాన్‌తో వచ్చి మేకలను గొర్రెలను ఎత్తుకెళ్లారని బాధితులు వాపోయారు. ఈ మేరకు బాధితులు మండల కేంద్రంలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story