పేదవాడికి న్యాయం ఏది..?

by Mahesh |
పేదవాడికి న్యాయం ఏది..?
X

దిశ, తాండూరు : భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 76 ఏండ్లు అవుతున్నా నేటికీ పేదవాడికి న్యాయం జరగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ నెల 14న జరిగిన ఘటన ఇందుకు ఉదాహరణ. తాండూరు మండలం గౌతాపూర్ గ్రామ సమీపంలో ఉన్న బసవేశ్వర నగర్‌లో సంగేమ్ కాలనీ గ్రామానికి చెందిన నాగభూషణంకు చెందిన పాలిషింగ్ యూనిట్‌లో పనిచేస్తున్న వలస కూలీలు దత్తు, లావణ్య దంపతుల 5 నెలల బాలుడిపై పెంపుడు కుక్క అతి ఘోరంగా దాడి చేసింది. దీంతో ఆ పసికందు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. బాలుడి తల్లిదండ్రులే పెంపుడు కుక్క తన కుమాడిపై దాడి చేసి చంపేందని చెప్పారు. కానీ అధికార పార్టీ ఓ నేత జోక్యం చేసుకొని, బాధితులకు రూ.50 వేలు సెటిల్మెంట్ చేసి కేసు కాకుండా ప్రయత్నాలు చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాధితులకు రూ.50 వేలు ఇస్తే.. మధ్యవర్తిగా ఉన్న కొందరు వ్యక్తులు రూ.లక్ష వరకు పెంపుడు కుక్క యజమాని దగ్గర వసూలు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో యజమాని ఎవరని తెలిసినా కేసు నమోదు చేయకపోవడంతో పోలీసులపై కూడా విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Next Story