- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పిఠాపురంలో ఆసక్తికర పరిణామం..జనసేన పార్టీ నేత పై సస్పెన్షన్ ఎత్తేసిన జనసేనాని
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు ముగియడంతో ఇక ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై స్టేట్ పాలిటిక్స్‌లో జోరుగా చర్చ జరుగుతుంది. ఎన్నికల ముందు ఓ నేత పై ఆగ్రహించిన జనసేన పార్టీ అతన్ని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచింది. వివరాల్లోకి వెళితే..మాదేపల్లి శ్రీనివాస్ (రాయవరం) ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం పట్టణ జనసేన అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పార్టీ గీత దాటాడంటూ జనసేన అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకుంది.
ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ ముఖ్యనేత కొణిదెల నాగబాబు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. మాదేపల్లి శ్రీనివాస్‌ను ఎన్నోసార్లు హెచ్చరించినా కూటమి పొత్తు ధర్మానికి విరుద్దంగా వ్యవహరించారని జనసేన పార్టీ ఆరోపించింది.ఈ క్రమంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత జనసేన పార్టీ అతనిపై సస్పెన్షన్ ఎత్తివేసినట్లు తెలిపింది. ఈ సస్పెన్షన్‌కు కారణమైన ఆరోపణలపై ఆయన సంతృప్తికరమైన సమాధాన ఇచ్చిన నేపథ్యంలోసస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నామని తెలిపారు. ఆయన పిఠాపురం నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యకలాపాల్లో ఎప్పటి మాదిరిగానే పాల్గనొచ్చని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.